తెలంగాణ

telangana

ETV Bharat / sports

కెప్టెన్​గా వేగంగా 5 వేల మార్కు అందుకున్న విరాట్​

పింక్ టెస్టులో విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్ పుజారా నిలకడగా ఆడుతున్నారు. కెప్టెన్​గా టెస్టుల్లో వేగంగా 5 వేల పరుగులు చేసిన క్రికెటర్​గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.

నిలకడగా టీమిండియా బ్యాట్స్​మెన్​.. కోహ్లీ 5వేల మార్కు

By

Published : Nov 22, 2019, 7:48 PM IST

చారిత్రక డే/నైట్‌ టెస్టులో భారత బ్యాట్స్‌మెన్‌ ఛెతేశ్వర్‌ పుజారా, విరాట్ కోహ్లీ, నిలకడగా ఆడుతున్నారు. వీరిద్దరూ ఇప్పటికే 50 పైచిలుకు పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.

ఆరంభంలోనే మయాంక్ అగర్వాల్ ఔటైనా.. రోహిత్ శర్మ.. పుజారాతో కలిసి ఇన్నింగ్స్​ ముందుకు నడిపించాడు. కానీ ఇబాదత్‌ హొస్సేన్‌ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమై ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీతో కలిసి పుజారా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. బంగ్లా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ మూడో వికెట్‌కు అర్ధశతకం భాగస్వామ్యం నమోదు చేశాడు.

కోహ్లీ 5 వేల పరుగులు..

వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తున్న విరాట్ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. కెప్టెన్​గా టెస్టుల్లో వేగంగా 5వేల పరుగులు చేసిన బ్యాట్స్​మన్​గా​ కోహ్లీ రికార్డు సృష్టించాడు. 86 ఇన్నింగ్స్​ల్లోనే ఈ ఘనత అందుకున్నాడు భారత సారథి. మొత్తంగా విరాట్.. 84 టెస్టుల్లో 7100 పరుగులు చేశాడు. ఇందులో 26 శతకాలు, 22 అర్ధసెంచరీలు ఉన్నాయి.

106 పరుగుల బంగ్లా స్కోరును ఇప్పటికే అధిగమించిన భారత్.. ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది.

ఇదీ చదవండి: పింక్ టెస్టు: రోహిత్​కు లైఫ్.. భారత్ స్కోరు 35/1​

ABOUT THE AUTHOR

...view details