తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కోచ్​ ఎంపికపై తుది నిర్ణయం కమిటీదే'

టీమిండియా కోచ్​ ఎంపిక విషయంపై కెప్టెన్​ అభిప్రాయం ఏదైనా తుది నిర్ణయం మాత్రం కమిటీదేనని చెప్పారు అందులోని సభ్యురాలు శాంతా రంగస్వామి.

'కోచ్​ ఎంపికపై తుది నిర్ణయం కమిటీదే'

By

Published : Aug 2, 2019, 5:00 AM IST

టీమిండియాకు కోచ్​ ఎంపిక చేసే విషయంపై కెప్టెన్​ కోహ్లీ అభిప్రాయాన్ని గౌరవిస్తామని చెప్పారు భారత జట్టు మాజీ కెప్టెన్​, ప్రస్తుత క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు కపిల్​దేవ్.

"కోచ్​ రవిశాస్త్రి కొనసాగితే బాగుంటుందనేది కోహ్లీ అభిప్రాయం. అతడిలానే అందరి మాటల్ని మేం గౌరవిస్తాం. ఇదేమి కష్టమైన పని కాదు. శక్తి మేర పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం." -కపిల్ దేవ్, టీమిండియా మాజీ కెప్టెన్.

ఇదే విషయంపై స్పందించిన మరో సభ్యురాలు శాంతా రంగస్వామి.. తుది నిర్ణయం మాత్రం కమిటీదేనని అన్నారు. భారత జట్టుకు కోచ్​గా అత్తుత్యమ వ్కక్తినే నియమిస్తామని స్పష్టం చేశారు.

"విరాట్​ కెప్టెన్​ మాత్రమే. అతడి అభిప్రాయం చెప్పడం తప్పు కాదు. కానీ అంతిమ నిర్ణయం మాత్రం ముగ్గురు సభ్యుల కమిటీదే. అందరి అభిప్రాయలపై ఓ అంచనాకు వచ్చి ఆ తర్వాత కోచ్​గా ఎవరిని ఎంపిక చేయాలో ఖరారు చేస్తాం." -శాంతా రంగస్వామి, క్రికెట్ సలహా మండలి సభ్యురాలు.

ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఈ క్రికెట్ ఎడ్వైజరీ కమిటీ ఈ నెలలో ఇంటర్వూలు నిర్వహించనుంది.

ABOUT THE AUTHOR

...view details