తెలంగాణ

telangana

ETV Bharat / sports

'మా విజయాలకు ఆ ముగ్గురి సలహాలే కీలకం' - కోహ్లి

టీమిండియా తరఫున కుల్​దీప్​ యాదవ్​తో కలిసి సాధించిన విజయాల్లో ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించారని చెప్పాడు స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్.

'మా విజయాల్లో కీలకపాత్ర.. ఆ ముగ్గురి సలహాలే'

By

Published : May 15, 2019, 12:57 PM IST

భారత క్రికెట్​ జట్టులో స్పిన్నర్లు అంటే అశ్విన్-జడేజా గుర్తొచ్చేవారు ఒకప్పుడు. ప్రస్తుతం ఆ స్థానాన్ని చాహల్- కుల్​దీప్​ జోడీ భర్తీ చేసింది. కొన్నేళ్లుగా వీరిద్దరూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ జంట అరంగేట్రం చేసినప్పటి నుంచి 159 వికెట్లు తీశారు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్​ల్లో వీరిద్దరూ బంతితో మాయ చేశారు.ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ ఇచ్చిన విలువైన సలహాలే ఇందుకు కారణమని చెప్పాడు యజ్వేంద్ర చాహల్.

కుల్​దీప్- చాహల్ జోడీ

"కుల్​దీప్​ నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. మేమిద్దరం మ్యాచ్​లో పిచ్​ పరిస్థితులు బట్టి ఎక్కడ బంతి వేయొచ్చా అని కొన్నిసార్లు ధోనీభాయ్ సలహాలు తీసుకుంటాం. అదే విధంగా కోహ్లీ, రోహిత్ శర్మ.. మా బౌలింగ్​ మెరుగుపర్చుకునేందుకు సహయపడ్డారు. మా విజయాల్లో ఈ ముగ్గురి పాత్ర కీలకమైనది." - యజ్వేంద్ర చాహల్, టీమిండియా బౌలర్

ఇటీవలే జరిగిన ఐపీఎల్​లో​ బెంగళూరు తరఫున ఆకట్టుకున్నాడు చాహల్. ఈ టోర్నీలో ఆడిన చాలా మంది క్రికెటర్స్​ ప్రపంచకప్​లోనూ ఎదురవుతారని చెప్పాడీ స్పిన్ బౌలర్. వారికి అడ్డుకట్ట వేసేందుకు ఇది తనకెంతో ఉపయోగపడుతుందని తెలిపాడు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details