ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మార్క్ వా... తన పరిశీలన దృష్ట్యా వన్డేల్లో అత్యుత్తమ బ్యాట్స్మెన్ల పేర్లు వెల్లడించాడు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ కోహ్లీ టాప్‌లో నిలిచాడు. తర్వాతి స్థానాల్ని బట్లర్(ఇంగ్లండ్), వార్నర్(ఆస్ట్రేలియా) చేజిక్కించుకున్నారు.
"కచ్చితంగా విరాట్ కోహ్లీదే అగ్ర స్థానం. ఇంగ్లండ్‌కు చెందిన జాస్ బట్లర్‌కు రెండో స్థానం ఇస్తున్నా. వార్నర్ ఆ తర్వాతి ప్లేస్‌లో ఉంటాడు." -మార్క్ వా, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్
గతేడాది ఐసీసీ ప్రకటించిన మూడు ప్రధాన అవార్డుల్ని సొంతం చేసుకున్నాడుకోహ్లీ. ప్రస్తుతం ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. కెప్టెన్‌గా అతడికిదే తొలి ప్రపంచకప్. వన్డేల్లో ఇప్పటికే 41 సెంచరీలు బాదేశాడు విారాట్.
ఇంగ్లండ్ వన్డే బ్యాట్స్‌మెన్ జాస్ బట్లర్.. ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 50 బంతుల్లోనే సెంచరీ చేసి తానేంటో మరోసారి నిరూపించాడు. అంతకు ముందు వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 77 బంతుల్లో 150 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
బాల్ టాంపరింగ్ వివాదంతో దాదాపు ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్. ఇటీవలే ఐపీఎల్లో హైదరాబాద్ తరఫున ఆడి సీజన్లో టాప్ స్కోరర్ నిలిచాడు.