తాజాగా ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా సారథి కోహ్లీ అగ్రస్థానం నిలబెట్టుకున్నాడు. బౌలింగ్ విభాగంలో బుమ్రా టాప్ ప్లేస్‌ను(774 పాయింట్లు) కైవసం చేసుకున్నాడు.
తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో 310 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు కోహ్లీ . అదే సిరీస్‌లో 202 పరుగులతో మెరిసిన రోహిత్.. రెండో ర్యాంకులో కొనసాగుతున్నాడు.
బ్యాటింగ్‌లో మూడో స్థానంలో రాస్ టేలర్ ఉండగా.. సొంతగడ్డపై జరుగుతున్న సిరీస్‌లో ఆకట్టుకున్న దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ డికాక్ నాలుగో స్థానానికి ఎగబాకాడు.
భారత ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ కెరీర్లో అత్యుత్తమంగా 11 స్థానాలు మెరుగుపడి 24వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు.
బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ రెండో ర్యాంకులో ఉండగా, ఆప్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ మూడో స్థానానికి పడిపోయాడు. ఏడు స్థానాలు ఎగబాకిన తాహిర్ నాలుగో స్థానానికి చేరుకున్నాడు.
టీం విభాగంలో ఇంగ్లాండ్ మొదటి స్థానంలో ఉండగా, భారత జట్టు రెండో స్థానంలో కొనసాగుతోంది.