వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం, మాజీ సారథి బ్రియాన్ లారా.. తన ఫేవరేట్ క్రికెటర్ల జాబితాను ప్రకటించాడు. ఇందులో కోహ్లీ(టీమ్ఇండియా), కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్), జో రూట్(ఇంగ్లాండ్), ఏబీ డివిలియర్స్(దక్షిణాఫ్రికా), స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా).. ఈ ఐదుగురుని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా కితాబిచ్చాడు. బుమ్రా(టీమ్ఇండియా), జోఫ్రా ఆర్చర్, జేమ్స్ అండర్సన్(ఇంగ్లాండ్), కగిసొ రబాడా(దక్షిణాఫ్రికా), స్పిన్నర్ రషీద్ ఖాన్(అఫ్గానిస్థాన్)ను అత్యుత్తమ బౌలర్లని పొగిడాడు.
ఎదుర్కొన్న అత్యుత్తమ ఆటగాళ్లు
సచిన్ తెందుల్కర్, రికీ పాంటింగ్, జాక్వెస్ కలిస్, కుమార సంగక్కర, రాహుల్ ద్రవిడ్ తాను ఎదుర్కొన్న అత్యుత్తమ ఐదుగురు బ్యాట్స్‌మెన్ అని తెలిపాడు లారా. వసీమ్ అక్రమ్, షేన్ వార్న్, వకార్ యూనిస్, ముత్తయ్య మురళీధరన్, గ్లెన్ మెక్ గ్రాత్ బౌలర్లని చెప్పాడు.