తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్మిత్​కు చెక్​.. మళ్లీ నెంబర్​ వన్​ స్థానానికి కోహ్లీ

తాజాగా ఐసీసీ విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​లో టీమిండియా సారథి కోహ్లీ మరోసారి నెంబర్​ వన్ స్థానానికి చేరుకున్నాడు. ఆల్​రౌండర్ల విభాగంలో రవీంద్ర జడేజా రెండో స్థానంలో నిలిచాడు.

kohli
కోహ్లీ

By

Published : Dec 4, 2019, 2:24 PM IST

Updated : Dec 4, 2019, 3:10 PM IST

సుదీర్ఘ ఫార్మాట్ క్రికెట్​​లో భారత జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్​లో... టీమిండియా స్టార్​ బ్యాట్స్​మన్​ విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇటీవల యాషెస్​లో సత్తాచాటి నెంబర్​ వన్​కు చేరిన స్మిత్​ను... రెండో స్థానానికి నెట్టేశాడు విరాట్​. బౌలింగ్​ విభాగంలో ముగ్గురు, ఆల్​రౌండర్ల విభాగంలో ఇద్దరు టాప్​-10లో ఉండటం విశేషం. ప్రస్తుతం 120 పాయింట్లతో భారత్​ టాప్​ జట్టుగా కొనసాగుతోంది.

పింక్​ టెస్టు ప్రదర్శన...

ఈడెన్​ వేదికగా బంగ్లాదేశ్​తో జరిగిన డే/నైట్​ టెస్టు​లో.. కోహ్లీ 136 పరుగులతో రాణించాడు. ఈ ప్రదర్శన ఫలితంగా 928 పాయింట్లకు చేరాడు. ఆస్ట్రేలియా క్రికెటర్​ స్మిత్​.. ఇటీవల పాకిస్థాన్​తో జరిగిన రెండో టెస్టులో 36 పరుగులే చేసి నిరాశపర్చాడు. ఫలితంగా 931 పాయింట్ల నుంచి 923 పాయింట్లకు పడిపోయాడు.

కోహ్లీతో పాటు ఛతేశ్వర పుజారా 4, అజింక్యా రహానే 6 ర్యాంకుల్లో నిలిచి టాప్​-10లో చోటు దక్కించుకున్నారు. మయాంక్ అగర్వాల్​ టాప్​-10 నుంచి చోటు కోల్పోయాడు.

వార్నర్​ 12 స్థానాలు..

ఆసీస్​ ఓపెనర్​ డేవిడ్​ వార్నర్​ పాకిస్థాన్​తో జరిగిన రెండో టెస్టులో ట్రిపుల్​ సెంచరీ సాధించాడు. 335* పరుగుల వ్యక్తిగత అత్యధికం నమోదు చేశాడు. ఈ ప్రదర్శన కారణంగా 12 స్థానాలు ఎగబాకి.. టాప్​-5లో చోటు దక్కించుకున్నాడు.

ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు, ఆస్ట్రేలియా క్రికెటర్​ లబుషేన్​.. కెరీర్​ తొలిసారి టాప్​-10లో స్థానం పొందాడు. గతేడాది 110వ ర్యాంక్​లో ఉన్న అతడు.. ఒక్క ఏడాదిలోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. పాకిస్థాన్​కు చెందిన బాబర్​ అజామ్​ రెండు స్థానాలు ఎగబాకి... 13 ర్యాంక్​ సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో 97 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇటీవలే 11వ ర్యాంక్​కు పడిపోయిన ఇంగ్లాండ్​ కెప్టెన్​ జో రూట్​... న్యూజిలాండ్​పై చేసిన 226 పరుగుల ప్రదర్శన ఫలితంగా 7వ స్థానం సంపాదించుకున్నాడు.

టాప్​-10లో ముగ్గురు..

బౌలర్ల ర్యాంకింగ్స్​లో ఆసీస్ ఆటగాడు కమిన్స్​ అగ్రస్థానంలో ఉండగా.. భారత్ నుంచి బుమ్రా 5, అశ్విన్ 9, మహ్మద్ షమీ 10 ర్యాంకుల్లో నిలిచారు. ఆస్ట్రేలియా పేసర్​ మిచెల్​ స్టార్క్.. అడిలైడ్​ టెస్టులో 7 వికెట్ల ప్రదర్శనకు గానూ 4 స్థానాలు ఎగబాకి​ 14వ ర్యాంక్​కు చేరాడు.

ఆల్​రౌండర్లలో టాప్​-5లో ఇద్దరు..

ఆల్​రౌండర్ల జాబితాలో వెస్టిండీస్ ఆటగాడు హోల్డర్.. 473 పాయింట్లతో నెంబర్​ వన్​గా కొనసాగుతున్నాడు. టీమిండియా నుంచి 406 పాయింట్లతో రవీంద్ర జడేజా 2వ స్థానంలోనూ, 308 పాయింట్లతో అశ్విన్ 5వ స్థానంలో ఉన్నారు.

ఇవీ చూడండి.. స్మిత్​కు చెక్​.. మళ్లీ నెంబర్​ వన్​ స్థానానికి కోహ్లీ

Last Updated : Dec 4, 2019, 3:10 PM IST

ABOUT THE AUTHOR

...view details