టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తండ్రి అయ్యాడు. అతడి సతీమణీ అనుష్క శర్మ సోమవారం ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్మీడియా ద్వారా పంచుకున్న కోహ్లీ.. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపాడు.
"ఈ మధ్యాహ్నం మా జీవితంలోకి పాప అడుగుపెట్టింది. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మాపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. మా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం. మా గోప్యతకు మీరంతా గౌరవం ఇస్తారని ఆశిస్తున్నాను"