కరోనాపై పోరాటంలో భాగంగా 'పీఎం కేర్స్'కు పలువురు ప్రముఖులు విరాళాలు అందజేస్తున్నారు. క్రీడాకారులూ తమ వంతు సాయమందిస్తున్నారు. ఇప్పుడీ జాబితాలోకి కోహ్లీ-అనుష్క జోడీ చేరింది. 'పీఎం కేర్స్', మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి డబ్బు అందిస్తామని ట్వీట్ చేశాడు విరాట్. అయితే ఎంత సొమ్ము చెల్లిస్తారనేది మాత్రం చెప్పలేదు.
మరికొందరు క్రీడాకారులు
కరోనా కట్టడికోసం ఇటీవలే దిగ్గజ క్రికెటర్ సచిన్ రూ. 50లక్షలు, సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనా రూ. 52 లక్షల విరాళాన్ని అందజేశారు. స్టార్ షట్లర్ పీవీ సింధు, రెజ్లర్ బజరంగ్ పూనియా, స్ప్రింటర్ హిమదాస్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీలు తమవంతు సాయమందించారు. బీసీసీఐ.. ప్రధానమంత్రి సహాయనిధికి రూ.51 కోట్ల విరాళాన్ని అందజేసింది.