తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కోహ్లీ.. నీలో నన్ను నేను చూసుకుంటున్నా' - టీమిండియా

వెస్టిండీస్​ దిగ్గజ క్రికెటర్​ వివ్‌ రిచర్డ్స్‌తో ముఖాముఖి నిర్వహించాడు టీమిండియా సారథి విరాట్​ కోహ్లీ. మైదానంలో తనలాగే దూకుడు ప్రదర్శిస్తున్నాడని విరాట్​ను ప్రశంసించాడు రిచర్డ్స్​. వీరిద్దరి మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణను బీసీసీఐ అధికారిక ట్విట్టర్​లో పంచుకుంది. వాటితో పాటే యాషెస్ టెస్టులో జోఫ్రా ఆర్చర్ విసిరిన బంతికి ఆసీస్​ బ్యాట్స్​మెన్​ స్టీవ్ స్మిత్ గాయపడటంపై ఇరువురు ఆటగాళ్లు మాట్లాడారు.

విరాట్ కోహ్లీతో విండీస్ మాజీ క్రికెటర్ వివ్ రిచర్డ్స్

By

Published : Aug 22, 2019, 7:16 PM IST

Updated : Sep 27, 2019, 9:56 PM IST

ప్రపంచ క్రికెట్​ చరిత్రలో విధ్వంసకర ఆటగాడిగా పేరున్న వివ్​ రిచర్డ్స్​, భారత జట్టు ప్రస్తుత సారథి విరాట్​ కోహ్లీ మధ్య చర్చా కార్యక్రమం జరిగింది. ఇందులో పలు విషయాలను పంచుకున్నారీ ఇద్దరు ఆటగాళ్లు. పేసర్​ల చేతిలో బ్యాట్స్​మెన్​ గాయపడటంపై వీరిద్దరూ విభిన్నంగా స్పందించారు.

"బంతి ఎప్పుడు తగులుతుందా అని భయపడుతూ ఉండటం కంటే, దెబ్బతిని నొప్పిని భరించటమే మంచిది. ప్రత్యర్థులపై మరింత కసితో ఆడటానికి ఆ బాధే ఆయుధం అవుతుంది. నొప్పి అనుభవిస్తున్నప్పుడు ఇంకోసారి ఇలా జరగదు కదా అనిపిస్తుంది".
-విరాట్​ కోహ్లీ, భారత క్రికెటర్​

ఎలాంటి పేసర్​​ను అయినా బెదురు లేకుండా ఎదుర్కొనడంలో రిచర్డ్స్​ దిట్ట. అదే విధంగా దెబ్బలనేవి ఆటలో భాగమని తెలిపాడు.

"ఆటలో దెబ్బతిన్నాక ఏ విధంగా ఆడతామనేదే ముఖ్యం. ఒకప్పుడు ఛాతి భాగంలో చిన్న గాడ్స్​ ఉండేవి. బంతి తగిలితే బాధపడేవాళ్లం. ఏదేమయినా ఇవన్నీ ఆటలో ఓ భాగమని గుర్తుంచుకోవాలి ".

-వివ్‌ రిచర్డ్స్​ , వెస్టిండీస్​ మాజీ క్రికెటర్

ఇప్పటి బ్యాట్స్​మెన్​కు రిచర్డ్సే ఆదర్శమని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. తామిద్దరి ఆటలో పోలికలున్నాయని వివ్​ స్పష్టం చేశాడు.

"పోటీకి నేనెప్పుడూ సిద్ధంగా ఉండేవాడిని. నా ఆటలో నేను అత్యుత్తమంగా ఉండాలని అనుకునేవాడిని. అలాంటి తీరే నీలో(కోహ్లీ) చూస్తున్నా. కొందరు మాత్రం నీలో కోపాన్ని మాత్రమే చూస్తారు.. ఎందుకంత కోపం అని ప్రశ్నిస్తారు".

-వివ్‌ రిచర్డ్స్​ , వెస్టిండీస్​ మాజీ క్రికెటర్

మంచి బౌలర్లు ఉన్న సమయంలోనూ మీరెందుకు హెల్మెట్​లు వాడలేదంటూ రిచర్డ్స్​ను ప్రశ్నించాడు కోహ్లీ.

"నేను చాలా గొప్పవ్యక్తినని నమ్మేవాడిని. చూసేవాళ్లు నాకు పొగరని అనుకొవచ్చు. కానీ అది ఆటలో భాగమని నేను భావిస్తా. హెల్మెట్​ నాకు అసౌకర్యంగా అనిపించేది. ఎరుపు రంగు టోపీ మాత్రం ధరించేవాడిని. ఆ సమయంలో గొప్పగా అనిపించేది. బాగా ప్రదర్శన ఇవ్వాలి అనుకున్నప్పడు దెబ్బలకు సిద్ధమయ్యేవాడిని. బాగా ఆడాలనే ఆలోచనతో మాత్రమే ఉండేవాడిని. ఒకవేళ దెబ్బలు తిన్నా.. దేవుడి దయ వల్ల సులభంగానే బయట పడేవాడిని.-వివ్‌ రిచర్డ్స్​, వెస్టిండీస్​ మాజీ క్రికెటర్

ఇది చదవండి: విరాట్​, బుమ్రాల సిక్స్​ప్యాక్​ పిక్.. యువీ ప్రశంసలు

Last Updated : Sep 27, 2019, 9:56 PM IST

ABOUT THE AUTHOR

...view details