తెలంగాణ

telangana

ETV Bharat / sports

రాహుల్​ ప్రదర్శనకు కారణం ఆ వీడియోలే - స్మిత్-విలియమ్సన్-డివిలియర్స్

వన్డేల్లో మిడిలార్డర్​లో ఎలా ఆడాలనే విషయమై, పలువురు స్టార్ క్రికెటర్ల వీడియోలు చూశానన్నాడు కేఎల్ రాహుల్. అవి తనకు చాలా ఉపయోగపడ్డాయని చెప్పాడు. ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో, భారత్ గెలవడంలో కీలక పాత్ర వహించాడీ బ్యాట్స్​మన్.

రాహుల్​ ప్రదర్శనకు కారణం ఆ వీడియోలే
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్

By

Published : Jan 18, 2020, 4:37 PM IST

ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో తన ప్రదర్శనతో అదరగొట్టాడు భారత్​ బ్యాట్స్​మన్ కేఎల్ రాహుల్. అటు బ్యాటింగ్​లో ఐదో స్థానంలో దిగి, 80 పరుగులు చేశాడు. వికెట్​ కీపింగ్​లోనూ సత్తా చాటాడు. టీమిండియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించి, మ్యాన్​ ఆఫ్ ద మ్యాచ్​ను అందుకున్నాడు. ఆ తర్వాత మాట్లాడిన రాహుల్.. తను ఏ స్థానంలోనైనా దిగేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు.

కేఎల్ రాహుల్, టీమిండియా క్రికెటర్

"జట్టుగా ఆడేటపుడు, అందరూ దానికోసమే ఆడాలి. అలాంటి సమయంలో ఈ స్థానంలో రావాలనే నిబంధనలు ఏం నాకు లేవు. ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నా. ఇది గొప్ప ఛాలెంజ్​లా భావిస్తున్నా. ఒత్తిడికి లోనవకుండా, స్వేచ్ఛగా ఆడాలనే చూస్తా. ఆడటాన్ని ఆస్వాదిస్తా. ప్రిపరేషన్​ కోసం పలువురు మిడిలార్డర్ క్రికెటర్ల వీడియోలు చూశా. వారిలో ఏబీ డివిలియర్స్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ ఉన్నారు. ఈ స్థానంలో ఎలా ఆడాలనే విషయమై కెప్టెన్ కోహ్లీతో ఎక్కువగా చర్చించా. అది చాలా ఉపయోగపడింది" -కేఎల్ రాహుల్, టీమిండియా క్రికెటర్

భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ప్రస్తుతం​ 1-1తో సమమైంది. నిర్ణయాత్మక మూడో వన్డే ఆదివారం(19న) బెంగళూరులో జరగనుంది. గెలిచిన జట్టుకే సిరీస్ సొంతమవుతుంది.

కేఎల్ రాహుల్, టీమిండియా క్రికెటర్

ABOUT THE AUTHOR

...view details