తెలంగాణ

telangana

ETV Bharat / sports

21 ఏళ్ల తర్వాత కేఎల్ రాహుల్ రికార్డు సెంచరీ

భారత బ్యాట్స్​మన్ వికెట్​ కీపర్​ కేఎల్ రాహుల్.. మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసియా బయట దేశాల్లో సెంచరీ చేసిన రెండో వికెట్​ కీపర్​గా నిలిచాడు.

21 ఏళ్ల తర్వాత కేఎల్ రాహుల్ రికార్డు సెంచరీ
భారత బ్యాట్స్​మన్ వికెట్​ కీపర్​ కేఎల్ రాహుల్

By

Published : Feb 11, 2020, 2:04 PM IST

Updated : Feb 29, 2020, 11:47 PM IST

న్యూజిలాండ్​తో జరుగుతున్న మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్..​ నిర్ణీత ఓవర్లలో 296 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ సెంచరీతో రాణించాడు. ఈ క్రమంలోనే సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఆసియా బయట దేశాల్లో వన్డేల్లో శతకం చేసిన భారత రెండో వికెట్ కీపర్​గా చరిత్ర సృష్టించాడు. అంతకు ముందు 1999లో రాహుల్ ద్రవిడ్.. ఇంగ్లాండ్​లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో సెంచరీ చేశాడు.

రాహుల్ ద్రవిడ్-కేఎల్ రాహుల్

దీనితో పాటే మరో రెండు ఘనతలు సాధించాడు రాహుల్. న్యూజిలాండ్​పై వన్డేల్లో సెంచరీ చేసిన మొదటి వికెట్​ కీపర్​గా నిలిచాడు. ఐదు లేదా ఆ తర్వాతి స్థానాల్లో వచ్చి శతకం చేసిన వికెట్​ కీపర్​గానూ నిలిచాడు. మాజీ కెప్టెన్ ధోనీ సరసన చేరాడు. 2017లో ఇంగ్లాండ్​పై మహీ.. 134 పరుగులు చేశాడు.

రాహుల్ సెంచరీల ఘనత

అతి తక్కువ ఇన్నింగ్స్​ల్లో నాలుగు శతకాలు చేసిన వారిలో రాహుల్ రెండో స్థానంలో నిలిచాడు. అతడి కంటే ముందు ధావన్(24 ఇన్నింగ్స్) ఉన్నాడు. తర్వాతి కోహ్లీ(36), గంభీర్(44), సెహ్వాగ్(55) ఉన్నారు.

Last Updated : Feb 29, 2020, 11:47 PM IST

ABOUT THE AUTHOR

...view details