తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అతడి ఆట చూస్తే మాకు వచ్చే కిక్కే వేరు' - క్రికెట్ ప్రపంచకప్​

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని సహచర బ్యాట్స్​మన్ రాహుల్ ప్రశంసించాడు. పరిస్థితులు ఎలా ఉన్నా అద్భుతంగా బ్యాటింగ్​ చేస్తాడని చెప్పాడు. అతడి ప్రదర్శనలు జట్టు సభ్యుల్లో స్ఫూర్తి కలిగిస్తాయని అన్నాడు.

కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టు సభ్యుల్లో స్ఫూర్తి నింపుతాడన్న బ్యాట్స్​మెన్ రాహుల్

By

Published : Jun 28, 2019, 11:02 AM IST

Updated : Jun 28, 2019, 11:13 AM IST

మాంచెస్టర్​లో జరిగిన ప్రపంచకప్​ మ్యాచ్​లో వెస్టిండీస్​పై 125 పరుగుల తేడాతో గెలిచింది టీమిండియా. కెప్టెన్​ కోహ్లీ 72 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అనంతరం జరిగిన సమావేశంలో సహచర బ్యాట్స్​మన్ కేఎల్ రాహుల్ కోహ్లీని ప్రశంసించాడు. పరిస్థితులు ఎలా ఉన్నా విరాట్ అద్భుతంగా బ్యాటింగ్​ చేస్తాడని పొగడ్తలు కురిపించాడు.

కేఎల్ రాహుల్​తో విరాట్ కోహ్లీ

"పరిస్థితులు, బౌలింగ్ ఎలా ఉన్నా కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్​ చేస్తాడు. బౌలర్లపై ఒత్తిడి పెంచుతాడు. ఒక్క ప్రపంచకప్​లోనే కాకుండా టీ20, వన్డే, టెస్టులు, ఐపీఎల్ ఇలా అన్ని ఫార్మాట్​ల్లోనూ చెలరేగుతుంటాడు. అత్యుత్తమ ప్రదర్శనలు మళ్లీ మళ్లీ చేస్తుంటాడు. ఈ విషయాలే జట్టు సభ్యుల్ని అతడి నుంచి స్ఫూర్తి పొందేలా చేస్తున్నాయి." -కేఎల్ రాహుల్, టీమిండియా బ్యాట్స్​మన్

ఈ మ్యాచ్​లో ఓపెనర్​గా వచ్చిన రాహుల్ 48 పరుగులు చేసి ఉన్నంతసేపు విరాట్​కు చక్కటి సహకారమందించాడు. ఆదివారం జరిగే తన తర్వాతి మ్యాచ్​లో ఇంగ్లాండ్​తో తలపడనుంది కోహ్లీసేన.

ఇది చదవండి: ఎదురులేని టీమిండియా.. విండీస్​పై అలవోక విజయం

Last Updated : Jun 28, 2019, 11:13 AM IST

ABOUT THE AUTHOR

...view details