తెలంగాణ

telangana

ETV Bharat / sports

'తొలిసారి కెప్టెన్సీ.. ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' - ఐపీఎల్​ 2020 న్యూస్​

ఐపీఎల్​లో తొలిసారి కెప్టెన్​గా మైదానంలో అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని కేఎల్​ రాహుల్ చెప్పాడు​. ఓపెనర్​గా, వికెట్​ కీపర్​గా, సారథిగా బాధ్యతలు ఎలా ఉండనున్నాయో తనకు తెలియదని వెల్లడించాడు.

KL Rahul on playing in IPL 2020 : Not sure if my form is going to be the same as it was seven months ago
'ఈ ఐపీఎల్ నాకు ప్రత్యేకం..​ ఎలా ఉండబోతుందో చూడాలి!'

By

Published : Sep 3, 2020, 7:34 AM IST

ఐపీఎల్​లో ఓపెనర్​గా, వికెట్​ కీపర్​గా, కెప్టెన్​గా బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్ ఆటగాడు​​ కేఎల్​ రాహుల్​ అన్నాడు.

"తీవ్ర ఒత్తిడితో కూడిన ఐపీఎల్​లో మూడు బాధ్యతలు చేపట్టనుండటం మేలు చేస్తుందా? ప్రతికూలంగా మారుతుందా? అన్నది తెలియదు. ఈ సవాలును ఎదుర్కొనేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నా"

-కేఎల్​ రాహుల్​, కింగ్స్ ఎలెవన్​ పంజాబ్​ కెప్టెన్​

ధోనీ రిటైర్మెంట్ వల్ల టీమ్​ఇండియాలోనూ వికెట్​కీపర్​గా తొలి ప్రాధాన్యం రాహుల్​నే వరించే అవకాశం కనిపిస్తోంది. ​కీపింగ్​ నైపుణ్యంలో ధోనీతో పోల్చడం ఒత్తిడికి గురిచేస్తుందా అన్న ప్రశ్నకు.. "ఇప్పటికైతే లేదు. ప్రస్తుతం నా దృష్టంతా ఐపీఎల్​పైనే. భారత క్రికెట్​లో ధోనీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. జట్టులో ఎలాంటి బాధ్యత అప్పగించినా చేపట్టేందుకు సిద్ధం" అని చెప్పాడు.

"వికెట్లు నెమ్మదిగా ఉండే పక్షంలో ప్రత్యర్థి జట్టును 170 పరుగులలోపు కట్టడి చేయాలి. క్రీజులో కుదురుకున్న బ్యాట్స్​మెన్​ 20వ ఓవర్​ వరకు ఆడటం ముఖ్యం. దుబాయ్​కు రాకముందు కొంచెం ఒత్తిడికి లోనయ్యాం. చాలా రోజులు క్రికెట్​ ఆడలేదు. టోర్నీలో అందరి పరిస్థితి అదే. నైపుణ్యాల్ని సానబెట్టుకునేందుకు ఈ మూడు వారాల సమయం ఎంతో ఉపయోగపడుతుంది" అని రాహుల్​ చెప్పాడు.

రాహులే మా వికెట్​ కీపర్​!

కేఎల్‌ రాహులే తమ తొలి ప్రాధాన్య వికెట్‌కీపర్‌ అని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కోచ్‌ అనిల్‌ కుంబ్లే అన్నాడు. "కేఎల్‌ కచ్చితంగా వికెట్‌ కీపింగ్‌ చేస్తాడు" అని చెప్పాడు. రాహుల్‌తో తనకు మంచి అనుబంధం ఉందని, నిర్ణయాలు తీసుకోవడంలో అది ఉపయోగపడుతుందని కుంబ్లే అన్నాడు. "సీజన్‌కు కెప్టెన్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. రాహుల్‌ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. బెంగుళూరులో పెరిగాడు. పంజాబ్‌ తరఫున రెండు సీజన్లు ఆడిన అతడికి జట్టు గురించి నాకన్నా ఎక్కువ తెలుసు" అని కుంబ్లే చెప్పాడు

అనిల్‌ కుంబ్లే

ABOUT THE AUTHOR

...view details