టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఇటీవలే తండ్రయ్యాడు. తన తనయుడి ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. తాజాగా హార్దిక్ సోదరుడు కృనాల్ పాండ్య కూడా చిన్నారితో కలిసి ఉన్న చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. "క్రికెట్ గురించి మాట్లాడుకుందాం" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అయితే ఈ ఫొటోకు పాండ్య సన్నిహితుడు, సహచర ఆటగాడు కేఎల్ రాహుల్ ఫన్నీ రిప్లై ఇచ్చాడు.
పాండ్య తనయుడికి రాహుల్ సలహా ఇదే! - హార్దిక్ పాండ్య కృనాల్ పాండ్య
టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తండ్రయ్యాడు. చిన్నారి ఫొటోలు సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నాడు. తాజాగా హార్దిక్ సోదరుడు కృనాల్ కూడా బుడ్డోడితో దిగిన ఓ చిత్రాన్ని షేర్ చేశాడు. దానికి రిప్లై ఇచ్చాడు సహచర ఆటగాడు కేఎల్ రాహుల్.
పాండ్య తనయుడికి రాహుల్ సలహా ఇదే!
పాండ్య తనయుడికి ఓ సలహా కూడా ఇచ్చాడు రాహుల్. "అతడికి చెప్పు దయచేసి ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కావాలని" అంటూ రిప్లై చేశాడు. ఈ కామెంట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
దుబాయ్లో ఈ ఏడాది నూతన సంవత్సరం సందర్భంగా నటాషా, పాండ్యల నిశ్చితార్థం జరిగింది. ఇటీవలే తన భార్య గర్భవతి అయినట్లు ప్రకటించాడు పాండ్య. అప్పటి నుంచి వీరిద్దరికి సంబంధించిన ఫొటోలను నెట్టింట పెడుతూ వచ్చాడు.