వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా ఓపెనర్ రాహుల్ ఆకట్టుకోలేకపోయాడు. దీనిపై అభిమానుల నుంచి విమర్శలు వినిపించాయి. రోహిత్ శర్మను టెస్టుల్లోనూ ఓపెనర్‌గా బరిలో దించాలన్న సూచనలు వచ్చాయి. అయితే ఈ విషయమై తాజాగా భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించాడు.
"వెస్టిండీస్ పర్యటనలో ఆటగాళ్ల ఆటతీరుపై విశ్లేషణ చేస్తాం. రాహుల్ ఫామ్ ఆందోళన కలిగించే విషయమే. ఓపెనర్‌గా రోహిత్ ఎంపికపై చర్చిస్తాం."
-ఎమ్మెస్కే ప్రసాద్, సెలక్షన్ కమిటీ ఛైర్మన్
ఇంతకుముందు టెస్టుల్లో మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసేవాడు రోహిత్. కానీ ఇప్పుడు ఆ స్థానంలో తెలుగు ఆటగాడు హనుమ విహారీ మంచి ప్రదర్శన చేస్తున్నాడు. ఫలితంగా రోహిత్‌కు ఆ స్థానం దక్కే అవకాశం లేదు. ఇప్పుడు సెలక్టర్ల దృష్టి ఓపెనింగ్‌పై పడింది. రాహుల్ ఫామ్ ఆందోళన కలిగిస్తున్న దృష్ట్యా వన్డే, టీ20ల్లో ఓపెనర్‌గా అదరగొడుతున్న హిట్‌మ్యాన్‌ను టెస్టుల్లోనూ అదే స్థానంలో ఆడించడానికి ప్రయత్నిస్తామని ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపాడు.