టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ప్రముఖ ఆటగాళ్లు కోహ్లీ, కేఎల్ రాహుల్ తలో స్థానం మెరుగుపరుచుకున్నారు. ఈ క్రమంలోనే ఐసీసీ, బుధవారం కొత్త జాబితాను విడుదల చేసింది.
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీ, ఓపెనర్ కేఎల్ రాహుల్.. తమ ర్యాంకుల్ని మెరుగుపరుచుకున్నారు. తలో స్థానం పైకి ఎగబాకారు. ఈ మేరకు ఐసీసీ కొత్త ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది. ఇందులో కేఎల్ రాహుల్ మూడు, కోహ్లీ ఎనిమిదో ర్యాంక్‌లో ఉన్నారు.