తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కోల్​కతా జట్టు ముందే అతడిని తీసుకోవాల్సింది​' - Rasel latest news

విండీస్​ ఆల్​రౌండర్ రసెల్​ను, కోల్​కతా నైట్​రైడర్స్​ కాస్త ముందుగానే జట్టులోకి తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్. అందువల్ల మరిన్ని టైటిల్స్​ సాధించి ఉండేవాళ్లమని చెప్పాడు.

KKR would've won more titles had they bought Andre Russell
'రసెల్​ను కేకేఆర్​ అప్పట్లోనే కొనుగోలు చేయాల్సింది​'

By

Published : Apr 19, 2020, 5:21 AM IST

వెస్టిండీస్​ క్రికెటర్​ ఆండ్రూ రసెల్​పై ప్రశంసలు కురిపించాడు కోల్​కతా నైట్​ రైడర్స్ మాజీ కెప్టెన్, టీమిండియా మాజీ క్రికెటర్​​ గౌతమ్​ గంభీర్​. ఇతడిని​​ ​కేకేఆర్ జట్టు మొదట్లోనే కొనుగోలు చేసి ఉంటే ​ఐపీఎల్‌లో మరిన్ని టైటిల్స్ గెలిచే వాళ్లమని అభిప్రాయపడ్డాడు గౌతీ.

"కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ రూ. 50 లక్షలకు రసెల్‌ను కొనుగోలు చేయగా, దిల్లీ ఫ్రాంఛైజీ రూ. 8 కోట్లకు పవన్‌ నేగిని సొంతం చేసుకుందంటే ఒక్కసారి ఊహించుకోండి. నేను కోల్‌కతా కెప్టెన్‌గా ఉన్న రోజుల్లో కాస్త ముందుగా రసెల్​ను తీసుకోవాల్సింది. అలా అయితే కనీసం ఒకటి లేదా రెండు టైటిల్స్‌ ఎక్కువ గెల్చుకునేవాళ్లం"

-గంభీర్, టీమిండియా మాజీ క్రికెటర్​

2012లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రసెల్.. తొలుత దిల్లీ క్యాపిటల్స్ (దిల్లీ డేర్‌డెవిల్స్) తరఫున ఆడాడు. గాయాల వల్ల ఆ సీజన్​లో తక్కువ మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. అనంతరం 2014లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇతడిని కొనుగోలు చేసింది. అప్పటినుంచి ఇప్పటివరకు తన విధ్వంసకర ప్రదర్శనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 64 మ్యాచ్‌లాడిన రసెల్.. 1400 పరుగులు చేయడం సహా, 55 వికెట్లు తీశాడు.

ఇదీ చూడండి : 'పాక్ క్రికెటర్లూ ఆ విషయంలో మీరు బాధ్యతగా ఉండాలి'

ABOUT THE AUTHOR

...view details