తెలంగాణ

telangana

ETV Bharat / sports

యువీని గుర్తుకుతెచ్చిన కార్టర్.. 6 బంతుల్లో 6 సిక్సర్లు

యువరాజ్ సింగ్ తరహాలో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టాడు న్యూజిలాండ్ బ్యాట్స్​మన్ లియో కార్టర్. ఆ దేశంలో జరుగుతున్న దేశవాళీ టీ20 టోర్నీలో ఈ ఘనత సాధించాడు.

Kiwis Batsman Hit a Six Sixes In a Row in One Over
ఆరు బంతులకు ఆరు సిక్సర్లు

By

Published : Jan 5, 2020, 1:06 PM IST

న్యూజిలాండ్ బ్యాట్స్​మన్ లియో కార్టర్ అరుదైన ఘనత సాధించాడు. ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాదిన ఏడో బ్యాట్స్​మన్​గా రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్లో ఈ ఘనత సాధించిన 4వ ఆటగాడిగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు.

కివీస్​లో జరుగుతున్న దేశవాళీ టోర్నీ సూపర్ స్మాష్ సిరీస్​లో 6 బంతులకు 6 సిక్సర్లు కొట్టాడు కార్టర్. నార్తర్న్​ నైట్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో క్యాంటర్ ​బరీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కార్టర్​.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నైట్స్ బౌలర్ ఆంటోన్ డేవిచ్.. లియో ప్రతాపానికి బాధితుడయ్యాడు. ఇన్నింగ్స్​ 16వ ఓవర్లో ఈ ఘనత సాధించాడు కార్టర్.

ఫలితంగా నార్తర్న్ నైట్స్ నిర్దేశించిన 220 పరుగుల భారీ లక్ష్యాన్ని క్యాంటర్ బరీ జట్టు సునాయాసంగా ఛేదించి.. 7 వికెట్ల తేడాతో నెగ్గింది. లియో కార్టర్ 29 బంతుల్లో 70 పరుగులు చేశాడు.

లియో కార్టర్​తో కలిపి క్రికెట్​లో ఇప్పటివరకు 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన వారు ఏడుగురున్నారు. అంతకుముందు గారీ సోబర్స్(వెస్టిండీస్), రవిశాస్త్రి(భారత్), గిబ్స్(దక్షిణాఫ్రికా), యువరాజ్ సింగ్(భారత్), రాస్ వైట్లే(ఇంగ్లాండ్), హజ్రతుల్లా జజాయ్(ఆఫ్గనిస్థాన్) ఈ జాబితాలో ఉన్నారు.

టీ20 క్రికెట్లో నాలుగో స్థానంలో ఉన్నాడు కార్టర్. యువరాజ్ సింగ్, రాస్ వైట్లే, హజ్రతుల్లా అతడి కంటే ముందున్నారు. 2007 టీ20 ప్రపంచకప్​లో​ ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్​లో 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టి పొట్టి ఫార్మాట్​లో ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్​మన్​గా యువీ రికార్డు సృష్టించాడు. ఆ మ్యాచ్​లో 12 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు యువీ. ఈ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు.

ఇదీ చదవండి: విరాట్​పై వినూత్న అభిమానం.. ఫోన్లతో బొమ్మ రూపకల్పన

ABOUT THE AUTHOR

...view details