తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆ సిరీస్‌లో అందరూ బాల్‌టాంపరింగ్‌ చేశారు'

క్రికెట్​లో బాల్​ ట్యాంపరింగ్​పై టీమ్​ఇండియా మాజీ వికెట్​కీపర్​ కిరణ్​ మోరె స్పందించారు. గతంలో ఇది ఓ సాధారణ విషయంగా పరిగణించేవారని పేర్కొన్నారు.

KIRAN MORE
కిరణ్​ మోరె

By

Published : Jul 10, 2020, 7:27 AM IST

ప్రస్తుత క్రికెట్​లో బాల్‌ టాంపరింగ్‌ చేసిన ఆటగాళ్లపై కఠిన చర్యలు విధిస్తున్నారు. కానీ ఇంతకుముందు అది ఓ సాధారణ విషయమని టీమ్‌ఇండియా మాజీ వికెట్‌కీపర్‌ కిరణ్‌ మోరె వెల్లడించాడు. 1989లో భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య సిరీస్‌లో ఇరు దేశాలకు చెందిన ఆటగాళ్లూ రివర్స్‌ స్వింగ్‌ రాబట్టేందుకు బంతి రూపు మార్చారని చెప్పాడు.

"ఆ రోజుల్లో బంతిపై గీరడాన్ని పెద్ద నేరంగా చూసేవారు కాదు. అలా చేసినందుకు ఏ జట్టు కూడా మరో జట్టుపై ఫిర్యాదు చేసేది కాదు. ప్రతి ఒక్కరూ బంతిని గీరి రివర్స్‌ స్వింగ్‌ వచ్చేలా చేసేవాళ్లు. ఆ పరిస్థితుల్లో బ్యాటింగ్‌ చేయడం బ్యాట్స్‌మన్‌కు సవాలుగా ఉండేది. మనోజ్‌ ప్రభాకర్‌ కూడా బంతిని గీరుతూ.. రివర్స్‌ రాబట్టడాన్ని నేర్చుకున్నాడు. ఆటగాళ్లు బంతి ఆకారం మారుస్తున్నారని తెలిసినా ఏమీ చేయలేని స్థితిలో అంపైర్లు ఉండేవారు."

కిరణ్ మోరె, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​

ఆ సిరీస్‌కు అంపైర్‌గా వ్యవహరించిన జాన్‌ హోల్డర్ ఇదే విషయంపై‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "అప్పట్లో శిక్షలు విధించే అధికారం మాకు ఉండేది కాదు. ఆటగాళ్లు బంతి గీరుతూనే ఉండేవాళ్లు. చివరకు కెప్టెన్లను, మేనేజర్లను పిలిచి ఇలా చేయడం విరుద్ధం అని చెప్పాం"అని పేర్కొన్నాడు.

ఇదీ చూడండి:'లాక్​డౌన్​లో విశ్రాంతి లభించినా.. ఆటతీరులో మార్పు వస్తుంది'

ABOUT THE AUTHOR

...view details