ఐపీఎల్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. పేరు మార్చుకోబోతున్నట్లు సమాచారం. ఈ నెల 18న జరగనున్న వేలంలో 'పంజాబ్ కింగ్స్' పేరుతో పాల్గొననున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం బీసీసీఐకి తెలియజేసిందని క్రికెట్ వర్గాలు తెలిపాయి. బోర్డు నుంచి అనుమతి కూడా లభించినట్టు చెప్పాయి.
ఐపీఎల్: కొత్త పేరుతో పంజాబ్ జట్టు - kings eleven punjab name changed
ఫిబ్రవరి 18న జరగనున్న ఐపీఎల్ వేలంపాటలో 'కింగ్స్ ఎలెవన్ పంజాబ్'.. తన పేరును మార్చుకుని 'పంజాబ్ కింగ్స్' పేరుతో పాల్గొననున్నట్లు సమాచారం. ఇందుకు బీసీసీఐ కుడా అనుమతిచ్చినట్లు తెలిసింది.

పంజాబ్
అయితే పేరు మార్పు వెనక ఉన్న కారణాల గురించి యాజమాన్యం కానీ, ఫ్రాంచైజీ అధికారులు కానీ వెల్లడించలేదు. మరో రెండు రోజుల్లో ముంబయిలో ఘనంగా 'రీ-లాంచ్' కార్యక్రమం నిర్వహించాలని కింగ్స్ ఎలెవన్ యాజమాన్యం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదీ చూడండి :ఐపీఎల్-2021 వేలం: ఈ విషయాలు తెలుసుకోండి!