సెప్టెంబర్ 19న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ ఆరంభంకానుంది. ఇందుకోసం ఫ్రాంచైజీలు యూఏఈ వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. అన్ని జట్ల యాజమాన్యాలు క్యాంప్లు ఏర్పాటు చేసి ఆటగాళ్లకు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నాయి. అలాగే ప్రాక్టీస్ సెషన్లకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. కాగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బృందం అప్పుడే యూఏఈ పయనమైంది.
యూఏఈకి పయనమైన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ - కింగ్స్ ఎలెవన్ పంజాబ్
సెప్టెంబర్ 19న ఆరంభమయ్యే ఐపీఎల్లో పాల్గొనేందుకు యూఏఈకి పయనమయ్యాయి జట్లు. కాగా ఈరోజు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు యూఏఈకి బయలుదేరింది. దానికి సంబంధించిన ఫొటోలు షేర్ చేశారు ఆటగాళ్లు.
యూఏఈకి పయనమైన తొలిజట్టుగా పంజాబ్
పంజాబ్ ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో ఉండగా తీసిన ఫొటోను షేర్ చేస్తూ "దుబాయ్ బయలుదేరాం" అంటూ పేసర్ మహ్మద్ షమీ ట్విటర్లో ఫొటోలు పోస్ట్ చేశాడు. అలాగే కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా ఓ ఫొటోను షేర్ చేశాడు.