న్యూజిలాండ్ పేసర్ జేమ్స్ నీషమ్ ఆరేళ్ల కిందట ఐపీఎల్ ఆడాడు. 2014లో దిల్లీ తరఫున పలు మ్యాచ్‌లు ఆడిన అతడు తర్వాత మళ్లీ మెగా టోర్నీలో అడుగుపెట్టలేదు. ఇన్నేళ్ల తర్వాత ఈసారి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున బరిలో దిగనున్నాడు. ప్రస్తుతం దుబాయ్‌లో జట్టుతో ఉన్న అతడు తాజాగా మీడియాతో మాట్లాడాడు.
"ఈసారి పంజాబ్ కచ్చితంగా విజయం సాధిస్తుంది. సుదీర్ఘ టోర్నీ ఆడటం నాకిదే తొలిసారి. పాత ఆటగాడిగా, అనుభవం కలిగిన బౌలర్‌గా మళ్లీ ఐపీఎల్‌లో ఆడటం సంతోషంగా ఉంది. అందుకోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. గతంలో దిల్లీ తరఫున ఆడా. అయితే, అప్పుడెలా ఆడాలనే విషయంపై స్పష్టమైన అవగాహన లేక ఇబ్బందులు పడ్డా."