తెలంగాణ

telangana

ETV Bharat / sports

గేల్ మెరుపులు.. రాయల్స్ లక్ష్యం 185 పరుగులు

జయపురలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్​లో రాజస్థాన్ ముందు 185 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది పంజాబ్ కింగ్స్ ఎలెవన్.

గేల్

By

Published : Mar 25, 2019, 9:58 PM IST

Updated : Mar 25, 2019, 10:04 PM IST

రాజస్థాన్​ రాయల్స్​తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్​​లో... మొదట బ్యాటింగ్​కు దిగిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు...184 పరుగులు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన కింగ్స్ ఎలెవన్​​కి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మొదటి ఓవర్లోనే కేఎల్ రాహుల్ (4) పెవిలియన్ బాట పట్టాడు. మయాంక్ అగర్వాల్ 22 పరుగులు చేసి అవుటయ్యాడు. అనంతరం వచ్చిన సర్ఫరాజ్ ఖాన్​తో కలిసి గేల్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదుతూ విధ్వంసం సృష్టించారు. 47 బంతుల్లో 8 బౌండరీలు, 4 సిక్సులు బాదిన గేల్...79 పరుగులు చేశాడు. స్టోక్స్ బౌలింగ్​లో వెనుదిరిగాడు. 46 పరుగులతో సర్ఫరాజ్ ఖాన్ ఆకట్టుకున్నాడు.

ప్రారంభంలో రాజస్థాన్ ఆటగాళ్లు..కట్టుదిట్టంగా బౌలింగ్​ చేశారు. వారి జోరుతో.. పంజాబ్ జట్టు మొదటి పది ఓవర్లలో 68 పరుగులు మాత్రమే చేసింది. తర్వాత గేల్, సర్ఫరాజ్ జోరుతో తదుపరి 5 ఓవర్లలో 57 పరుగులు వచ్చాయి. జోఫ్రా ఆర్చర్ అద్భుతమైన బౌలింగ్​తో ఆకట్టుకున్నాడు. నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులే ఇచ్చి మెప్పించాడు.

రాజస్థాన్ బౌలర్లలో స్టోక్స్​కి రెండు వికెట్లు దక్కగా.. కులకర్ణి, గౌతమ్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

ఐపీఎల్​లోగేల్ మరో ఘనత సాధించాడు. 112 ఇన్నింగ్స్​ల్లోనే 4వేల పరుగులు సాధించాడు. అతి తక్కువ ఇన్నింగ్స్​ల్లో ఈ ఘనత సాధించిన విదేశీ ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

Last Updated : Mar 25, 2019, 10:04 PM IST

ABOUT THE AUTHOR

...view details