తెలంగాణ

telangana

ETV Bharat / sports

సచిన్, సెహ్వాగ్​లను వెనక్కి నెట్టిన విరాట్ కోహ్లీ - kohli centuries

తన కెరీర్​లో 7వ ద్విశతకం చేసిన విరాట్.. భారత మాజీ క్రికెటర్లు సచిన్, సెహ్వాగ్​లను అధిగమించాడు. అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన భారత బ్యాట్స్​మెన్​గా నిలిచాడు.

విరాట్ కోహ్లీ

By

Published : Oct 11, 2019, 3:29 PM IST

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో చెలరేగి ఆడుతున్నాడు. ఈ క్రమంలో 7వ డబుల్​ సెంచరీ చేసిన ఈ బ్యాట్స్​మన్.. భారత మాజీ క్రికెటర్లు సచిన్ తెందూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్​లను అధిగమించాడు. వీరిద్దరూ తలో 6 ద్విశతకాలు చేశారు.

అదే విధంగా ఈ ఫార్మాట్​లో కెప్టెన్​గా 9 సార్లు 150 పైచిలుకు పరుగులు చేసి, దిగ్గజ బ్రాడ్​మన్(8)​ను వెనక్కినెట్టాడు. 7 సార్లు చేసిన వారిలో బ్రియన్ లారా, మహేలా జయవర్ధనే, గ్రేమ్ స్మిత్, క్లార్క్ ఉన్నారు.

11 ఇన్నింగ్స్​ల తర్వాత ఈ మ్యాచ్​లో సెంచరీ చేశాడు విరాట్ కోహ్లీ. ఇప్పటివరకు ఇంత ఎక్కువ వ్యవధి ఎప్పుడూ తీసుకోలేదు ఈ స్టార్ క్రికెటర్.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details