తెలంగాణ

telangana

ETV Bharat / sports

హోల్డర్​కు షాక్​.. విండీస్​ కెప్టెన్​గా పొలార్డ్​ - Kieron Pollard

వెస్టిండీస్ పరిమిత ఓవర్ల క్రికెట్​ జట్టుకు పొలార్డ్​ను సారథిగా నియమించింది విండీస్ క్రికెట్ బోర్డు. హోల్డర్​ టెస్టులకు కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు.

పొలార్డ్

By

Published : Sep 10, 2019, 1:28 PM IST

Updated : Sep 30, 2019, 2:57 AM IST

వెస్టిండీస్​ క్రికెట్​ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కెప్టెన్​గా కొనసాగుతున్న​ జాసన్ హోల్డర్​ను తొలగించి ఆ​ స్థానంలో పొలార్డ్​ను ఎంపికచేసింది. ఇప్పటినుంచి వన్డేలు, టీ20లకు అతడు సారథిగా కొనసాగుతాడని విండీస్​ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రికీ స్కెరిట్​ అధికారికంగా ప్రకటించారు.

వెస్టిండీస్​ క్రికెట్​ కమిటీ వన్డేలు, టీ20లకు కెప్టెన్​గా విధ్వంసకర ఆల్​రౌండర్ పొలార్డ్​కు బాధ్యతలు అప్పగించింది. 2016లో చివరగా వన్డేలు ఆడిన ఈ ఆటగాడు.. ఈ నిర్ణయంతో ప్రస్తుతం జట్టులోకి అడుగుపెట్టనున్నాడు.

ఇప్పటివరకు విండీస్​ తరఫున 101 వన్డేలు ఆడిన ఈ 32 ఏళ్ల ఆటగాడు 2,289 పరుగులు చేశాడు. 62 అంతర్జాతీయ టీ 20లలో 903 పరుగులు సాధించాడు.

'ఈ నిర్ణయం హోల్డర్​తో ప్రస్తావించి తీసుకున్నామని.. ఇకపై అతను టెస్టులుకు మాత్రమే సారథిగా కొనసాగుతాడని' తెలిపాడు అధ్యక్షుడు స్కెరిట్.

"ఇప్పటినుంచి హోల్డర్​ టెస్టు కెప్టెన్​గా మాత్రమే కొనసాగుతాడు. ఈ జట్టులో స్థానం కోసం పోటీపడుతూ మంచి ఆటగాడిగా ఎదగడానికి ప్రయత్నిస్తాడు పొలార్డ్. ఎంతో ఉత్సాహంగా ఉంటూ.. ఆటపై నిబద్ధత చూపించే అతడు ఈ సమయంలో టీ20 బాధ్యతలకు సరైనవాడు." -రికీ స్కెరిట్​, విండీస్​ అధ్యక్షుడు

పది జట్లు పాల్గొన్న ప్రపంచకప్​లో హోల్డర్ సారథ్యంలో బరిలోకి దిగిన విండీస్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. టీమిండియాతో జరిగిన వన్డే, టీ20లకు బ్రాత్​వైట్​ సారథ్యం వహించాడు. ఈసిరీస్​లోనూ దారుణమైన ప్రదర్శనతో ఓటమి చవిచూసింది కరీబియన్​ జట్టు.

ఇదీ చూడండి: గృహహింస కేసులో షమి అరెస్టుపై స్టే

Last Updated : Sep 30, 2019, 2:57 AM IST

ABOUT THE AUTHOR

...view details