ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లతో అరుదైన ఘనత సాధించాడు వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్. బుధవారం శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ధనంజయ వేసిన ఆరో ఓవర్లో సిక్సర్ల మోత మోగించాడు. టీ20ల్లో విండీస్ తరఫున ఈ రికార్డు సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు.
మ్యాచ్‌లో వెస్టిండీస్ పూర్తి ఆధిపత్యం చూపింది. విండీస్ బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో 131/9 పరుగులకే చేతులెత్తేసింది శ్రీలంక. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ను ఆదిలోనే ధనంజయ దెబ్బతీశాడు. నాలుగో ఓవర్లో క్రిస్ గేల్ వికెట్ సహా హ్యాట్రిక్ వికెట్ సాధించాడు. అయితే జేసన్ హోల్డర్‌తో కలిసి పొలార్డ్ జట్టుకు సునాయాసంగా విజయాన్ని అందించాడు.