ప్రపంచకప్‌తో పాటు సొంతగడ్డపై టీమిండియాతో సిరీస్‌లో ఘోరంగా విఫలమైంది వెస్టిండీస్. ఫలితంగా వన్డే, టీ20 జట్లకు సారథులుగా ఉన్న హోల్డర్, బ్రాత్‌వైట్‌లను తప్పించాలని ఆ దేశ క్రికెట్ బోర్డు భావిస్తోంది. వీరిద్దరి స్థానంలో పొలార్డ్‌ను కెప్టెన్‌గా నియమించే అవకాశముంది.
ఇటీవల విండీస్ క్రికెట్ బోర్డు నిర్వహించిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చిందట. ఇందులో పొలార్డ్‌కు అనుకూలంగా ఆరు ఓట్లు, వ్యతిరేకంగా ఆరు ఓట్లు వచ్చాయని సమాచారం.
పది జట్లు పాల్గొన్న ప్రపంచకప్‌లో హోల్డర్ సారథ్యంలో బరిలోకి దిగిన విండీస్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. టీమిండియాతో జరిగిన వన్డే, టీ20లకు బ్రాత్‌వైట్ సారథ్యం వహించాడు. ఈసిరీస్లోనూ దారుణమైన ప్రదర్శనతో ఓటమి చవిచూసింది కరీబియన్ జట్టు. ఈ కారణంగా అనుభమున్న పొలార్డ్‌ను పరిమిత ఓవర్లకు కెప్టెన్‌గా నియమించాలని చూస్తోంది యాజమాన్యం.
చివరగా 2016లో వన్డే మ్యాచ్ ఆడాడు పొలార్డ్. ఇటీవల జరిగిన ప్రపంచకప్ కోసం రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. టీమిండియాతో సొంతగడ్డపై జరిగిన టీ20 సిరీస్‌లో చోటు సంపాదించాడు. ఇప్పటివరకు 101 వన్డేలు ఆడిన ఈ విధ్వంసకర ఆటగాడు.. 2,289 పరుగులతో పాటు, 50 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 62 టీ20 మ్యాచ్‌లు ఆడి 903 పరుగులతో పాటు 23 వికెట్లు తీశాడు.
ఇవీ చూడండి.. మా జట్టును చూసి గర్విస్తున్నా: రూట్