తెలంగాణ

telangana

ETV Bharat / sports

జాతీయ కాంట్రాక్ట్​లో ఓపెనర్​​కు దక్కని చోటు - Usman Khawaja latest news

ఆస్ట్రేలియా ప్రకటించిన కొత్త కాంట్రాక్ట్​ జాబితాలో ప్రముఖ బ్యాట్స్​మన్ ఖావాజాకు చోటు దక్కలేదు. అయితే లిస్ట్​లో కొత్తగా ఆరుగురికి స్థానం కల్పించింది ఆసీస్ బోర్డు.

జాతీయ కాంట్రాక్ట్​లో ఓపెనర్​​కు దక్కని చోటు
ఉస్మాన్ ఖవాజా

By

Published : Apr 30, 2020, 4:21 PM IST

ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆటగాళ్ల కొత్త కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించింది. ఇందులో నుంచి ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను అనూహ్యంగా తప్పించింది క్రికెట్ ఆస్ట్రేలియా. అతడు చివరగా గతేడాది ఆగస్టులో ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టులో పాల్గొన్నాడు. ఖవాజాతో పాటే హ్యాండ్స్​కాంబ్, హారిస్, కౌల్టర్​నైల్, స్టాయినిస్​ తొలిగించిన వారిలో ఉన్నారు.

ఖవాజా తప్పించడంపై మాట్లాడిన ఆసీస్ జట్టు సెలక్టర్

జాబితాలో కొత్తగా ఆరుగురికి చోటు కల్పించింది ఆసీస్ బోర్డు. వీరిలో యువ సంచలనం లబుషేన్ ఉన్నాడు. ఇతడితో పాటే జో బర్న్స్, అస్టన్ అగర్, మిచెల్ మార్ష్, కేన్ రిచర్డ్​సన్, మాథ్యూవేడ్​లు స్థానం సొంతం చేసుకున్నారు. వివిధ ఫార్మాట్లలో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా పాయింట్లు కేటాయించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ఈ మేరకు 20 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది.

ఆస్ట్రేలియా కొత్త కాంట్రాక్ట్‌ జాబితా

స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్, అస్టన్ అగర్, జో బర్న్స్, ప్యాట్ కమిన్స్, అరోన్ ఫించ్, జోష్ హేజిల్​వుడ్, ట్రావిస్ హెడ్, లబుషేన్, లైయన్, మిచెల్ మార్ష్, మ్యాక్స్​వెల్, టిమ్ పైన్, జేమ్స్ పాటిన్సన్, జహీ రిచర్డ్​సన్, కేన్ రిచర్డ్​సన్, మాథ్యూవేడ్, ఆడమ్ జంపా

ABOUT THE AUTHOR

...view details