ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ డాక్యుమెంటరీ చిత్రీకరణలో పాల్గొన్నాడు. అంతరించిపోతున్న అరుదైన జాతి ఖడ్గమృగం రైనో పరిరక్షణ కోసం ప్రజల్లో అవగాహన పెంచడంలో భాగంగా 'సేవ్ దిస్ రైనో' డాక్యుమెంటరీని తీశాడు. ఈ ఏడాది మార్చికి ముందే షూటింగ్ ప్రారంభించాడు. ఇప్పుడు మళ్లీ, దాదాపు ఆరు నెలలు తర్వాత దీనిలో భాగంగా అసోంలోని కజిరంగా జాతీయ పార్క్‌ను సందర్శించాడు. రైనోల గురించి వివరిస్తూ వాటిపై చిత్రీకరణ జరిపాడు. ఈ జంతువుల ప్రాముఖ్యత, వాటి సంఖ్య పెరగాల్సిన అవసరముందన్నాడు.
'రైనో' సంరక్షణపై పీటర్సన్ డాక్యుమెంటరీ - రైనోపై డాక్యూమెంటరీ
అంతరించిపోతున్న రైనో సంరక్షణ కోసం ప్రజల్లో అవగాహన పెంచేందుకు 'సేవ్ దిస్ రైనో' అనే డాక్యుమెంటరీని తీశాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్. సెప్టెంబరు 22న జియోగ్రాఫిక్ ఛానెల్లో ఇది ప్రసారం కానుంది.

కెవిన్ పీటర్సన్
ఈ డాక్యూమెంటరీ సెప్టెంబరు 22న నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్లో మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 9 గంటలకు ప్రసారం కానున్నట్లు తెలిపాడు పీటర్సన్. దీని టీజర్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.