ఈ ఏడాది ఐపీఎల్లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని దిల్లీ క్యాపిటల్స్ జట్టు ట్రోఫీని గెలవాలని ఆశిస్తున్నట్లు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ తెలిపాడు. ఈ క్రమంలోనే తన ఫొటోను ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసి.. "ఇంగ్లాండ్ బబుల్ నుంచి దుబాయ్‌లో ఏర్పాటు చేసిన బబుల్ వరకు. మళ్లీ క్రికెట్ ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. ఐపీఎల్లో ఎవరు గెలుస్తారనే విషయంపై ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. ఈ సారి దిల్లీ కప్పు సాధిస్తుందని ఆశిస్తున్నా" అంటూ రాసుకొచ్చాడు.
పీటర్సన్ గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దిల్లీ డేర్‌డెవిల్స్, రైజింగ్ పుణె వంటి జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.