ప్రపంచకప్ టోర్నీ ప్రారంభం కావస్తున్నా టీమిండియాలో మిడిలార్డర్ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. నాలుగో స్థానంలో ఎవరాడతారన్న అంశంపై ఇంకా స్పష్టత లేదు. తాజాగా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ స్థానంపై క్లూ ఇచ్చాడు. బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్ కోసం లండన్ నుంచి కార్డిఫ్ వెళుతుండగా తీసిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు రోహిత్.సరదాగా తీసిన ఈ వీడియోలో రోహిత్‌తో పాటు జడేజా, కేదార్ ఉన్నారు.
WC19: నాలుగో స్థానంపై క్లూ ఇచ్చిన రోహిత్
టీమిండియాకు నాలుగో స్థానంలో ఎవరాడతారన్న ప్రశ్నపై ఇంకా స్పష్టత రాలేదు. రోహిత్ శర్మపై ఈ విషయంపై చిన్న క్లూ ఇచ్చాడు.
రోహిత్
మొదటి ప్రాక్టీస్ మ్యాచ్‌లో జడ్డూ భాయ్ చాలా బాగా ఆడావు అంటూ మెచ్చుకున్నాడు రోహిత్. కేదార్‌ను ప్రస్తావిస్తూ "కొత్తగా రాబోతున్న రేస్ 4 సినిమాలో ఆఫర్ వచ్చిందటగా నిజమేనా" అని అడిగాడు. జాదవ్ స్పందిస్తూ.. "ఇంకా ఆ విషయంపై తుది నిర్ణయం కాలేదు. మీకందరికీ సర్ఫ్రైజ్ అయితే ఉంది" అని అన్నాడు.