తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచకప్​ ఆడేందుకు జాదవ్ సిద్ధం - ఫిట్​నెస్ సాధించిన జాదవ్

గాయంతో బాధపడుతున్న టీమిండియా బ్యాట్స్​మన్ కేదార్ జాదవ్ ఫిట్​నెస్ సాధించాడు. ప్రపంచకప్​లో పాల్గొనేందుకు మే 22న జట్టుతో పాటు ఇంగ్లాండ్​ వెళ్లనున్నాడు.

ప్రపంచకప్​ ఆడేందుకు జాదవ్ సిద్ధం

By

Published : May 18, 2019, 2:17 PM IST

ప్రపంచకప్​లో ఆడతాడా లేదా అని అనుమానంగా ఉన్న కేదార్ జాదవ్ గాయం నుంచి కోలుకున్నాడు. త్వరలో జరిగే ప్రపంచకప్​ కోసం మే 22న టీమిండియాతో కలిసి ఇంగ్లాండ్ వెళ్లనున్నాడు.

టీమిండియా బ్యాట్స్​మన్ కేదార్ జాదవ్

ఇటీవలే జరిగిన ఐపీఎల్​లో చెన్నైకు ప్రాతినిధ్యం వహించాడు కేదార్ జాదవ్. పంజాబ్​తో మ్యాచ్​లో బంతిని అందుకునే క్రమంలో అతడి భుజానికి గాయమైంది. జాదవ్​కు సంబంధించిన ప్రస్తుత హెల్త్ సర్టిఫికెట్​ను బీసీసీఐకు సమర్పించాడు ఫిజియో పాట్రిక్ ఫరార్త్.

54 వన్డేలు ఆడిన జాదవ్ 43.50 సగటుతో 1174 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. బౌలర్​గా 27 వికెట్లు తీశాడు.

మే 30న ప్రారంభం కానున్న క్రికెట్ ప్రపంచకప్​

మే 30న ప్రారంభం కానుంది ప్రపంచకప్​. జూన్ 5న దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్​ ఆడనుంది టీమిండియా. అంతకు ముందు మే 25న న్యూజిలాండ్​తో, 28న బంగ్లాదేశ్​తో ప్రాక్టీసు మ్యాచ్​లు ఆడనుంది.

ఇది చదవండి: అంత బాధలోనూ సెంచరీ కొట్టిన జేసన్​

ABOUT THE AUTHOR

...view details