నియమాలు అతిక్రమించినందుకు టీమిండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్‌కు నోటీసులు జారీ చేసిందిభారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ). ఇప్పుడు ఈ విషయంపై స్పందించాడీ ఆటగాడు. క్షమించమని కోరుతూ.. బోర్డుకు లేఖ రాశాడు.
"అనుమతి లేకుండా కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొన్నందుకు బీసీసీఐని క్షమాపణలు కోరుతున్నా. నిబంధనలకు వ్యతిరేకంగా అక్కడ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ట్రింబాగో నైట్ రైడర్స్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ విజ్ఞప్తి మేరకు డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చుని మ్యాచ్ చూశాను. మరోసారి ఇలా జరగదని హామీ ఇస్తున్నా" -దినేశ్ కార్తీక్, భారత క్రికెటర్
ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు దినేశ్ కార్తీక్. ఆ ఫ్రాంచైజీ యజమాని షారుఖ్ ఖాన్.. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రింబాగో నైట్ రైడర్స్ జట్టునూ సొంతం చేసుకున్నాడు. ఇటీవల ట్రింబాగో డ్రెస్సింగ్‌రూమ్‌లో మెక్కల్లమ్ పక్కన కూర్చుని, ఆ టీమ్ జెర్సీ ధరించి మ్యాచ్ చూశాడు కార్తీక్.
బీసీసీఐ నిబంధనల ప్రకారం.. భారత్ క్రికెటర్లు అనుమతి లేకుండా ఎలాంటి విదేశీ టోర్నీల్లో పాల్గొనకూడదు. అందువల్ల కార్తీక్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది బీసీసీఐ. వివరణ ఇవ్వాలని వారం గడువు పెట్టింది.
ఇది చదవండి: దినేశ్ కార్తీక్‌కు బీసీసీఐ షోకాజ్ నోటీసులు