తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్​లో ఈ యువ పేసర్​కు​ చోటు పక్కా? - virat kohli and prasidh

ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్​ కోసం వెళ్తున్న భారత జట్టులో... మరో యువ బౌలర్​ చోటు దక్కించుకునే అవకాశముంది. ఇప్పటికే అతడి ప్రదర్శనపై దృష్టి పెట్టిన కోహ్లీ, భారత జట్టు యాజమాన్యం.. తర్వలో న్యూజిలాండ్​ సిరీస్​కు చోటివ్వాలని భావిస్తున్నాయి. మరి అంతగా ఆకట్టుకున్న ఆ బౌలర్​ పేరే ప్రసిధ్​ కృష్ణ.

Karnataka pacer Prasidh Krishna Virat Kohli's World T20 surprise package?
టీ20 ప్రపంచకప్​లో ఈ యువ పేసర్​కు​ చోటు పక్కా..?

By

Published : Jan 8, 2020, 6:37 PM IST

Updated : Jan 8, 2020, 6:44 PM IST

కర్ణాటక దేశవాళీ క్రికెటర్​ ప్రసిధ్​​ కృష్ణ... ఈ ఏడాది టీ20 ప్రపంచకప్​ ముందు పలు టోర్నీలో తన ప్రతిభను నిరూపించుకోనే అవకాశముంది. ఇప్పటికే గతేడాది ఐపీఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్​ తరఫున ఆడిన ఈ పేసర్​.. అద్భుతంగా రాణించాడు. మరి ఈ యువ టాలెంట్​కు జనవరి 24 నుంచి ప్రారంభమయ్యే న్యూజిలాండ్​ సిరీస్​లో చోటిచ్చే అవకాశాలున్నాయి.

ప్రసిధ్​ కృష్ణ

ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేసే భారత జట్టులో కొత్త బౌలర్‌ను పరిశీలిస్తున్నామని.. ప్రసిధ్​ పేరు తెలిపాడు కోహ్లీ.

" భారత పేస్‌ దళంలో మంచి బౌలర్లు ఉన్నారు. ఒకే శైలిలో ఉండే బౌలర్లలో అనుభవం ఉన్న ఆటగాళ్లని తీసుకుంటాం. ఆస్ట్రేలియాకు (ప్రపంచకప్‌) కొత్తబౌలర్‌ను తీసుకునే అవకాశం ఉంది. అది అందర్నీ అశ్చర్యపరుస్తుంది. అతడే ప్రసిధ్‌ కృష్ణ. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. మంచి పేస్‌, బౌన్స్‌ వేయగలడు. బౌలర్లందరూ అన్నిఫార్మాట్లో రాణిస్తుండటం సంతోషంగా ఉంది. ప్రపంచకప్‌కు ఉత్తమ జట్టును ఎంపిక చేయడానికి మాకు మంచి ఆటగాళ్లు ఉన్నారు"
-- విరాట్​ కోహ్లీ, టీమిండియా సారథి

ప్రస్తుతం భారత పరిమిత ఓవర్ల పేస్‌ విభాగం జస్ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్, మహ్మద్‌ షమి, దీపక్‌ చాహర్, శార్దూల్‌ ఠాకూర్‌, నవదీప్‌ సైనితో ఎంతో పటిష్ఠంగా ఉంది. అయితే బుమ్రా, షమి, భువీ మినహా మిగిలిన వారికి మెగా టోర్నీ ఆడిన అనుభవం లేదు. అందుకే దీపక్, శార్దూల్, సైనీతో పాటు ఆసీస్‌ పిచ్‌లపై మంచి పేస్‌ వేయగలిగే బౌలర్​ను కూడా పరిగణించాలని జట్టు యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రసిధ్‌ కృష్ణ పేరును కోహ్లీ ప్రస్తావించడం వల్ల ప్రపంచకప్‌ జట్టు రేసులో అతడు కూడా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున ప్రసిధ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌లో 18 మ్యాచుల్లో 14 వికెట్లు తీశాడు.

Last Updated : Jan 8, 2020, 6:44 PM IST

ABOUT THE AUTHOR

...view details