కర్ణాటక జట్టు భారత క్రికెట్‌లో అరుదైన రికార్డు నెలకొల్పిన తర్వాత రోజునే ఆ రికార్డుకు బ్రేక్ పడింది. వరుసగా 15 టీ20లు గెలిచి చరిత్ర సృష్టించిన కన్నడ జట్టు.. ఈరోజు బరోడాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది. సయద్ ముస్తక్ అలీ టోర్నీలో భాగంగా శనివారం బరోడా, కర్ణాటక జట్లు టీ20 మ్యాచ్ ఆడాయి. మొదట బ్యాటింగ్ చేసిన బరోడా 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆ జట్టు కెప్టెన్ కెహెచ్ దేవ్‌ధర్(52) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అనంతరం లక్ష్య ఛేదనలో నిర్ణీత 20 ఓవర్లకు 182 పరుగులకే పరిమితమైంది కర్ణాటక. ఓపెనర్ రోహన్ కదమ్(57)తో పాటు కేకే నాయర్ (47) పోరాడినా మిగతా బ్యాట్స్‌మన్ విఫలమయ్యారు. ఫలితంగా 14 పరుగుల తేడాతో బరోడా విజయం సాధించింది.
వరుస విజయాలు సాధించిన జట్లు...
| | | |
సియల్‌కోట్ స్టాలియన్స్ | పాకిస్థాన్ | 25 | ఫిబ్రవరి 2006-అక్టోబర్ 2010 |
కర్ణాటక | భారత్ | 15 | జనవరి 2018- నవంబర్ 2019 |
ఒటాగో | న్యూజిలాండ్ | 15 | డిసెంబర్ 2012-సెప్టెంబర్ 2013 |
కోల్‌కతా నైట్ రైడర్స్ | భారత్ | 14 | మే 2014-అక్టోబర్ 2014 |
సర్రే | ఇంగ్లాండ్ | 13 | జూన్ 2003-ఆగస్టు 2004 |
అఫ్గానిస్థాన్ టీ20 జట్టు | అఫ్గానిస్థాన్ | 13 | మార్చి 2016-మే 2017 |
భారత్‌లో ఒకటి.. ప్రపంచంలో రెండు
గత మ్యాచ్‌లో ఉత్తరాఖండ్‌పై గెలిచిన కర్ణాటక.. భారత్‌లో వరుసగా అత్యధిక టీ20లు గెలిచిన జట్టుగా మొదటి స్థానంలో, ప్రపంచ క్రికెట్ జాబితాలో రెండో స్థానంలో న్యూజిలాండ్ సరసన నిలిచింది. కివీస్‌కు చెందిన ఒటాగో ఇప్పటికే 15 విజయాలతో సమంగా ఉంది. వీటి కన్నా ముందు పాకిస్థాన్ సియల్‌కోట్ స్టాలియన్స్ వరుసగా 25 టీ20 మ్యాచ్‌లు గెలిచి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. పాకిస్థాన్ నేషనల్ టీ20కప్ సందర్భంగా 2006-2010 మధ్య కాలంలో ఈ ఘనత సాధించింది.