శుక్రవారం జరిగిన ఫైనల్లో గెలిచిన కర్ణాటక.. నాలుగోసారి విజయ్ హజారే ట్రోఫీని ముద్దాడింది. బెంగళూరు వేదికగా తమిళనాడుతో జరిగిన ఈ మ్యాచ్లో 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. బౌలర్ అభిమన్య మిథున్(5/34) గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇందులో ఓ హ్యాట్రిక్ ఉండటం విశేషం.
నాలుగోసారి విజేతగా నిలిచిన కర్ణాటక - విజయ్ హజారే ట్రోఫీ
విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో 60 పరుగుల తేడాతో గెలిచింది కర్ణాటక. తమిళనాడుపై విజయం సాధించి నాలుగోసారి విజేతగా అవతరించింది.
నాలుగోసారి విజేతగా నిలిచిన కర్ణాటక
తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు.. 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్ అయింది. అభినవ్ ముకుంద్ 85, అపరాజిత్ 66 పరుగులు చేశారు. ఛేదనలో కర్ణాటక.. 23 ఓవర్లలో 146 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ 69, రాహుల్ 52 రన్స్ చేశారు. ఆ సమయంలో వర్షం పడటం వల్ల 40 నిమిషాల పాటు ఆట నిలిచిపోయింది. ఆ తర్వాత మ్యాచ్ కొనసాగించే అవకాశం లేకపోవడం వల్ల ఫీల్డ్ అంపైర్లు కర్ణాటకను విజేతగా ప్రకటించారు.
ఇది చదవండి: విజయ్ హజారే ట్రోఫీలో అరుదైన ఘనత