మాజీ క్రికెటర్ గోపాలస్వామి కస్తూరిరంగన్ (89) గుండెపోటుతో బుధవారం ఉదయం మరణించారు. బెంగళూరులోని చామరాజపేట స్వగృహంలో ఆయన కన్నుమూశారని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం కార్యదర్శి వినయ మృత్యుంజయ మీడియాకు తెలిపారు. ఆటగాడిగానే కాకుండా క్రికెట్ పాలకుడు, బీసీసీఐ క్యూరేటర్‌గానూ ఆయన సేవలందించారు.
గుండెపోటుతో మాజీ క్రికెటర్ కన్నుమూత - indian former cricketer died
కర్ణాటక మాజీ రంజీ క్రికెటర్ గోపాలస్వామి కస్తూరిరంగన్ తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ఆయన స్వగృహంలోనే మృతి చెందారు.
మాజీ క్రికెటర్ గోపాలస్వామి కస్తూరిరంగన్
1948-1963 వరకు రంజీ క్రికెట్లో గోపాలస్వామి మైసూర్‌కు ఆడారని క్రికెట్ వర్గాలు తెలిపాయి. మొదట్లో మైసూర్‌కు ఆడిన కస్తూరిరంగన్ 1962-63లో కర్ణాటకకు ఆడారు.
ఆయన మరణించారని తెలిసిన వెంటనే టీమ్ఇండియా మాజీ కోచ్, కెప్టెన్ అనిల్‌కుంబ్లే స్పందించారు. 'జి.కస్తూరిరంగన్ మరణించారని తెలిసి బాధపడ్డాను. క్రికెట్ అభివృద్ధి కోసం ఆయనెంతో కృషి చేశారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి' అని ట్వీట్ చేశారు.