తెలంగాణ

telangana

ETV Bharat / sports

'రిటైర్మెంట్ ప్రకటించాక ఏం చేయాలో తోచలేదు' - ద్రవిడ్ కపిల్ దేవ్

క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించాక ఏం చేయాలో తొలుత తోచలేదని తెలిపాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్. ఆ సందర్భంలో కపిల్ దేవ్ చెప్పిన సూచనలు చాలా బాగా పనిచేశాయని వెల్లడించాడు.

'రిటైర్మెంట్ ప్రకటించాక ఏం చేయాలో తోచలేదు'
'రిటైర్మెంట్ ప్రకటించాక ఏం చేయాలో తోచలేదు'

By

Published : Jul 18, 2020, 3:25 PM IST

టీమ్‌ఇండియా ఆటగాడిగా కెరీర్‌ ముగిసిన అనంతరం ఏం చేయాలనే విషయంపై మాజీ సారథి కపిల్‌ దేవ్‌ సూచనలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని జాతీయ క్రికెట్‌ అకాడమీ హెడ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ చెప్పాడు. భారత మహిళా జట్టు కోచ్‌ డబ్ల్యూవీ రామన్‌తో ఆన్‌లైన్‌లో ముచ్చటించిన ద్రవిడ్‌ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

ద్రవిడ్

"క్రికెటర్‌గా నా కెరీర్‌ ముగిసిన అనంతరం ఏం చేయాలో తొలుత పాలుపోలేదు. అప్పుడే కపిల్‌ దేవ్‌ ఒక మంచి విషయం చెప్పాడు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని.. కొన్నేళ్లు ఏదో ఒక పనిచేస్తూ నీకు ఏం నచ్చుతుందో దాని మీద ధ్యాస పెట్టమన్నాడు. ఆ మాటలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయి."

-ద్రవిడ్‌, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

ఇక తన కెరీర్‌ ముగింపు దశకు వచ్చేసరికే తాను రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు కెప్టెన్‌, కోచ్‌ బాధ్యతల్లో కొనసాగుతున్నానని, అదృష్టవశాత్తూ అలా కోచింగ్‌ కెరీర్‌ కొనసాగిందని స్పష్టంచేశాడు. అలాగే 1998లో తనను వన్డే జట్టు నుంచి తప్పించారని, స్ట్రైక్‌రేట్‌ కారణంగా అలా చేయడం వల్ల ఇక తాను ఈ ఫార్మాట్‌లో ఆడలేమోననే అభద్రతా భావం ఏర్పడిందన్నాడు. ఏడాది పాటు వన్డేల్లో ఆడలేదని ద్రవిడ్‌ చెప్పాడు. సహజంగా తాను టెస్టు క్రికెటర్‌ అని, తనకు కోచింగ్‌ కూడా టెస్టు క్రికెటర్‌లాగే సాగిందన్నాడు. ఒకవేళ తన కెరీర్‌ సాఫీగా సాగకపోయుంటే ఎంబీఏ చేసేవాడినని చెప్పాడు.

కపిల్ దేవ్

ABOUT THE AUTHOR

...view details