1983 ప్రపంచకప్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు కపిల్‌దేవ్. భారత క్రికట్ ప్రస్థానంలో ఆయనో సంచలనం. కపిల్ కెప్టెన్సీ ఓ చరిత్ర. ఆయన ఆల్‌రౌండ్ ప్రదర్శన అమోఘం. ఒక్కమాటలో చెప్పాలంటే.. '1983 ప్రపంచకప్ భారత్ గెలిచింది' అనేకన్నా 'కపిల్‌దేవ్ గెలిపించాడు' అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతలా పేరుగాంచిన కపిల్ భారత్‌లో ఎంతో మంది క్రికెటర్లకు ఆదర్శప్రాయుడయ్యారు. ఆటతీరుతో యావత్ క్రీడాలోకాన్నే ఔరా అనిపించారు. ఏమాత్రం అంచనాల్లేని టీమ్ఇండియాను ఏకంగా విశ్వవిజేతగా తీర్చిదిద్దారు. క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ మైదానంలో డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్‌ను మట్టికరిపించి తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడారు.
ఇక అప్పుడు మొదలైంది అసలు మజా. క్రికెట్ కనిపెట్టిన ఆ దేశంలో కన్నా భారత్‌లోనే ఈ ఆటకు అభిమానులు ఎక్కువయ్యారు. మరోమాటలో చెప్పాలంటే ఇక్కడ క్రికెట్ మతంలా మారింది. అందుకు కారణం ది గ్రేట్ లెజెండరీ క్రికెటర్ కపిల్‌దేవ్. బుధవారం (జనవరి 6) ఆయన పుట్టినరోజు సందర్భంగా కొంతమంది ప్రముఖ క్రికెటర్లు కపిల్‌దేవ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
"పుట్టినరోజు శుభాకాంక్షలు కపిల్‌దేవ్ పాజీ. ఈ ఏడాది మీకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా".
- సచిన్ తెందూల్కర్, దిగ్గజ క్రికెటర్
"పుట్టినరోజు శుభాకాంక్షలు కపిల్‌దేవ్. ఈ ఏడాది మీ కుటుంబంలో సంతోషంతో పాటు మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా".
- విరాట్ కోహ్లీ, టీమ్ఇండియా కెప్టెన్
"లెజెండరీ ఛాంపియన్, గ్రేటెస్ట్ ఆల్-రౌండర్ కపిల్‌దేవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆరోగ్యంగా, విజయవంతమైన జీవితాన్ని ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటున్నా. త్వరలోనే మిమ్మల్ని కలవడానికి ఎదురుచూస్తున్నా. ఈ ఏడాది మీకు మంచి జరగాలని కోరుకుంటున్నా".