తెలంగాణ

telangana

ETV Bharat / sports

దిగ్గజ క్రికెటర్​ కపిల్​దేవ్​కు గుండెపోటు! - 1983 ప్రపంచకప్ కపిల్​ దేవ్

kapildev with 1983 world cup
కపిల్ దేవ్

By

Published : Oct 23, 2020, 2:45 PM IST

Updated : Oct 23, 2020, 5:42 PM IST

14:42 October 23

దిల్లీ ఆస్పత్రిలో కపిల్​కు యాంజియోప్లాస్టీ

1983 ప్రపంచకప్​తో కపిల్​దేవ్

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ కపిల్​దేవ్​కు గురువారం రాత్రి ఛాతీలో నొప్పి రావడం వల్ల దిల్లీలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశముందని అన్నారు.

కపిల్​ త్వరగా కోలుకోవాలని భారత క్రికెటర్లు, మాజీలు.. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. వీరిలో సచిన్ తెందుల్కర్, శిఖర్ ధావన్, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు ఉన్నారు.

కొన్నిరోజుల్లో కపిల్ ఇంటికొస్తారు: మదన్

కపిల్ కోలుకోవాలని తనతో పాటే ప్రార్థించాలని ఆయన సహచరుడు మదన్​లాల్ కోరారు. త్వరలోనే కపిల్ ఇంటికొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

టీమ్​ఇండియాకు 16 ఏళ్ల పాటు క్రికెటర్‌గా సేవలు అందించిన కపిల్.. 131 టెస్టులు, 225 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 5000 పరుగులు తీయడం సహా 400కు పైగా వికెట్లు తీశారు. ఈ ఘనత సాధించిన తొలి బౌలర్​గా నిలిచాడు.  

Last Updated : Oct 23, 2020, 5:42 PM IST

ABOUT THE AUTHOR

...view details