తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆస్పత్రిలో కోలుకుంటున్న కపిల్

టీమ్​ఇండియా దిగ్గజ సారథి కపిల్ దేవ్ గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా హాస్పిటల్​లో కపిల్.. తన కూతురు ఆమ్యాతో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్​లో పంచుకున్నారు మాజీ క్రికెటర్ చేతన్ శర్మ.

Kapil Dev flashes double thumbs up sign after angioplasty
ఆస్పత్రిలో కోలుకుంటున్న కపిల్

By

Published : Oct 24, 2020, 12:35 PM IST

టీమ్‌ఇండియా దిగ్గజ సారథి కపిల్‌ దేవ్‌ గుండెపోటుకు గురయ్యారు. అయితే, ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని మాజీ క్రికెటర్‌ చేతన్‌ శర్మ వెల్లడించారు. ఆస్పత్రిలో కపిల్‌.. తన కూతురు ఆమ్యాతో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్​లో పోస్టు చేసిన ఆయన ఈ విషయాన్ని చెప్పారు.

కూతురితో కపిల్

అంతకుముందు కపిల్‌ కూడా తన ట్విట్టర్​లో క్షేమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన ఆరోగ్యం పట్ల ఆందోళన చెంది తనపై ప్రేమ చూపించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే పూర్తిగా కోలుకుంటానన్నారు.

ABOUT THE AUTHOR

...view details