ఆస్పత్రి నుంచి కపిల్ దేవ్ డిశ్చార్జ్ - Kapil Dev discharged from hospital
టీమ్‌ఇండియా దిగ్గజ సారథి కపిల్ దేవ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రెండు రోజుల కిందట ఛాతినొప్పి కారణంగా ఆయన హాస్పిటల్లో చేరారు.
ఆస్పత్రి నుంచి కపిల్ దేవ్ డిశ్చార్జ్
1983 ప్రపంచకప్ హీరో, టీమ్‌ఇండియా మాజీ సారథి కపిల్ దేవ్ ఇటీవల గుండెపోటుకు గురై ఆస్పత్రిపాలయ్యారు. శస్త్రచికిత్స అనంతరం ఆయన కోలుకోవడం వల్ల ఆదివారం డిశ్చార్జ్ అయినట్లు మాజీ క్రికెటర్ చేతన్ శర్మ వెల్లడించారు. కపిల్‌కు ఆంజియోప్లాస్టీ చేసిన డాక్టర్ అతుల్ మథుర్‌తో కలిసి దిగిన ఫొటోను చేతన్ ట్విటర్‌లో పంచుకుని ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఇప్పుడు క్షేమంగానే ఉన్నారని.. ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చారని చెప్పారు.
Last Updated : Oct 25, 2020, 3:03 PM IST