హిందువుగా పాకిస్థాన్ క్రికెటర్ల వివక్ష గురయ్యానని, ప్రస్తుతం కష్టాల్లో ఉన్నానని ఆ జట్టు మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా.. బుధవారం ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ అంశంపై భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మాట్లాడాడు. కనేరియాకు జరిగిన ఉదంతమే పాకిస్థాన్ నిజస్వరూపానికి ఊదాహరణ అని అభిప్రాయపడ్డాడు.
"ఒకప్పుడు క్రికెటరైన ఇమ్రాన్‌ఖాన్ ప్రస్తుత పాకిస్థాన్ అధ్యక్షుడుగా ఉన్నా, ఇలాంటి ఘటన జరిగింది. టీమిండియాకు చాలా ఏళ్లు సారథ్యం వహించిన మహ్మద్ అజారుద్దీన్ లాంటి కెప్టెన్ మాకున్నాడు. ఇప్పటికే అర్థమై ఉండాలి. మహ్మద్ కైఫ్, ఇర్ఫాన్ పఠాన్, మునాఫ్ పటేల్ లాంటి క్రికెటర్లకు భారత్ చాలా గౌరవమిచ్చింది. మునాఫ్ నా సన్నిహిత మిత్రుడు. మేం ఎప్పుడూ జట్టుగా ఆడి దేశానికి గర్వంగా నిలిచాం. పాకిస్థాన్ నుంచి ఇలాంటివి రావడం నిజంగా దురదృష్టకరం. ఓ క్రీడాకారుడికే అలాంటి దుస్థితి ఉంటే.. పాకిస్థాన్‌లో మైనార్టీలుగా ఉన్న హిందు, సిక్కుల పరిస్థితి ఎంటో ఊహించుకోవచ్చు"
-గౌతమ్ గంభీర్, టీమిండియా మాజీ క్రికెటర్
అక్తర్, కనేరియా వ్యాఖ్యలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పందించింది. వారిద్దరూ రిటైర్డ్ ప్లేయర్లని, ఈ అంశంపై తాము జవాబు చెప్పాల్సినవసరం లేదని చెప్పింది.