తెలంగాణ

telangana

ETV Bharat / sports

రక్షణ గార్డ్ ఫొటోతో స్టెయిన్​కు వీడ్కోలు..!

ఒకానొక సందర్భంలో స్టెయిన్​ వేసిన బంతి కారణంగా తన గార్డ్​ పగుళ్లిచ్చిందని చెబుతూ ఆ ఫొటోను ఇన్​స్టాలో పంచుకున్నాడు న్యూజిలాండ్​ సారథి కేన్ విలియమ్సన్.

By

Published : Aug 8, 2019, 7:00 AM IST

రక్షణ గార్డ్ ఫొటోతో స్టెయిన్​కు వీడ్కోలు

ఇటీవలే టెస్టులకు వీడ్కోలు పలికాడు దక్షిణాఫ్రికా ప్రముఖ పేసర్ డేల్ స్టెయిన్​​. అతడి బౌలింగ్​లో ఆడలేక బ్యాట్స్​మెన్ ఇబ్బందులకు గురైన సందర్భాలు అనేకం. ప్రస్తుత న్యూజిలాండ్​ సారథి కేన్ విలియమ్సన్ ఇలాంటి అనుభవాన్నే ఓ సారి ఎదుర్కొన్నాడు. అయితే స్టెయిన్​కు వినూత్నంగా​ వీడ్కోలు చెప్పాడీ క్రికెటర్. సంబంధిత ఫొటోను ఇన్​స్టాగ్రామ్​లో పంచుకున్నాడు.

అసలేం జరిగింది..?

2013లో న్యూజిలాండ్​-దక్షిణాఫ్రికా మధ్య టెస్టు మ్యాచ్​ జరుగుతుంది. స్టెయిన్​ సంధించిన బంతిని డిఫెన్స్​ చేయబోయిన విలియమ్సన్​ దాన్ని తాకలేకపోయాడు. కేన్ నడుము కింద భాగంలోని గార్డ్​ను తాకింది బాల్. దీంతో అది కొద్దిగా విరిగిపోయింది. ఇప్పుడు ఆ గార్డ్​ ఫొటోనే ఇన్​స్టాలో పంచుకున్నాడు విలియమ్సన్. ఇలా ఆ పేసర్​కు వీడ్కోలు పలికాడు.

36 ఏళ్ల స్టెయిన్​.. 2004లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఈ ఫార్మాట్​లో అత్యధిక వికెట్లు తీసిన సఫారీ బౌలర్​గా నిలిచాడు. ఇందులో 93 మ్యాచ్​లాడి 439 వికెట్లు పడగొట్టాడు. ఇటీవలే ఈ టెస్టు క్రికెట్​ నుంచి వైదొలిగాడు స్టెయిన్​.

ఇదీ చూడండి:తెలుపు జెర్సీకి స్పీడ్​గన్​​ స్టెయిన్​ విశ్రాంతి

ABOUT THE AUTHOR

...view details