విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్.. ఈ ఏడాది టెస్టుల్లో అగ్రస్థానం కోసం హోరాహోరీగా పోటీపడ్డారు. వీరిద్దరి మధ్య మొదటి స్థానం దోబూచులాడింది. కానీ వీరిద్దరినీ కాదని చివరికి ఈ ఏడాదిని టాప్ ర్యాంక్‌తో ముగించాడు న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్. ప్రస్తుతం ఇతడు 890 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. కోహ్లీ (879), స్టీవ్ స్మిత్ (877) తర్వాత స్థానాల్లో ఉన్నారు. అలాగే ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టులో అద్భుత ప్రదర్శన కనబర్చిన అజింక్యా రహానె ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో ర్యాంకుకు చేరుకున్నాడు. పుజారా రెండు స్థానాలు దిగజారి 10వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.
కోహ్లీ, స్మిత్ కాదు.. విలియమ్సనే నెంబర్‌వన్ - కేన్ విలియమ్సన్ నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎగబాకాడు న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్. ప్రస్తుతం ఇతడు 890 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా కోహ్లీ, స్మిత్ తర్వాత స్థానాల్లో ఉన్నారు. బౌలర్ల విభాగంలో కమిన్స్ అగ్రస్థానంతో ఈ ఏడాదిని ముగించాడు.
కోహ్లీ, స్మిత్ కాదు.. విలియమ్సన్ ఏ నెంబర్‌వన్!
బౌలర్ల విభాగంలో ఈ ఏడాది అగ్రస్థానంతో ముగించాడు ఆస్ట్రేలియా పేసర్ కమిన్స్. 906 పాయింట్లతో ఇతడు మొదటి స్థానంలో ఉండగా స్టువర్ట్ బ్రాడ్ (845), నీల్ వాగ్నల్ (833) తర్వాత స్థానాల్లో ఉన్నారు. స్టార్క్ రెండు స్థానాలు మెరుగు పర్చుకుని ఐదో ర్యాంకుకు చేరగా, అశ్విన్ రెండు స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంకుకు చేరుకున్నాడు. బుమ్రా ఒక స్థానం మెరుగుపర్చుకుని 9వ స్థానంలో నిలిచాడు.
Last Updated : Dec 31, 2020, 12:35 PM IST