ఇంగ్లాండ్‌తో మూడో టెస్టులో దక్షిణాఫ్రికా బౌలర్ రబాడ దురుసుగా ప్రవర్తించాడు. ఫలితంగా అతడిపై వేటు పడింది. గతంలోనూ ఐసీసీ మందలింపునకు గురైన రబాడ.. ఈ పరిణామంతో నాలుగో టెస్టుకు దూరమయ్యాడు.
మైదానంలో అతి చేసినందుకు రబాడపై వేటు - రబాడాపై వేటు
ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో, వికెట్ తీసిన ఆనందంలో మితిమీరి ప్రవర్తించాడు సఫారీ బౌలర్ రబాడ. ఈ కారణంతో ఐసీసీ ఓ డీమెరిట్ పాయింట్ అతడి ఖాతాలో చేర్చింది. ఈ క్రమంలోనే తర్వాతి మ్యాచ్‌కు దూరమయ్యాడీ పేస్ బౌలర్.
![మైదానంలో అతి చేసినందుకు రబాడపై వేటు మైదానంలో అతి చేసినందుకు రబాడాపై వేటు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5748008-679-5748008-1579281910833.jpg)
సఫారీ బౌలర్ రబాడా
ఏం జరిగిందంటే?
ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు తొలిరోజు రూట్‌ను ఔట్ చేశాడు రబాడ. ఆ తర్వాత అతడి దగ్గరికి వెళ్లి, బిగ్గరగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ విషయంపై మాజీ ఆటగాళ్లు సహా.. క్రికెట్ అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. విచారణ జరిపిన ఐసీసీ.. నియమావళి నిబంధన 2.5ను రబాడా అతిక్రమించినట్లు తేల్చింది. మ్యాచ్ ఫీజులో 15 శాతం కోతతో పాటు ఓ డీమెరిట్ పాయింట్‌ను అతడి ఖాతాలో చేర్చింది. ఇదివరకే ఉన్న పాయింట్ల కారణంగా, తర్వాతి టెస్టుకు దూరమయ్యాడు సౌతాఫ్రికా పేసర్.
Last Updated : Jan 18, 2020, 5:39 AM IST