దక్షిణాఫ్రికా క్రికెటర్ కగిసొ రబాడా మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్లో తమ జట్టు తరఫున 200 వికెట్లు తీసిన ఎనిమిదో బౌలర్‌గా నిలిచాడు. పాకిస్థాన్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. 44 టెస్టుల్లోనే ఈ మైలురాయిని చేరుకున్న మూడో వేగవంతమైన బౌలర్‌గానూ ఘనత సాధించాడు.
వన్డేల్లో 75 మ్యాచుల్లో 117, టీ20ల్లో 26 మ్యాచులు ఆడి 31 వికెట్లు తీశాడు రబాడా.
దక్షిణాఫ్రికా తరఫున 93 టెస్టుల్లో డేల్ స్టెయిన్ 439 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. షాన్ పొలాక్ (421), ఎన్తిని(390), అలెన్ డొనాల్డ్(330), మోర్నీ మోర్కెల్(309), జాక్వెస్ కలిస్(291), ఫిలాండర్(224) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా టెస్టులో ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీధరన్(800) తొలి స్థానంలో ఉండగా.. షేన్ వార్న్(708), అనిల్ కుంబ్లే(619), జేమ్స్ అండర్సన్(606) గ్లెన్ మెక్‌గ్రాత్(563) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఇదీ చూడండి: 'ప్రపంచ అత్యుత్తమ టీ20 బౌలర్లలో రబాడా ఒకడు'