తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్ నుంచి హెజిల్​వుడ్ ఔట్.. కారణమిదే! - హెజిల్​వుడ్ ఐపీఎల్ 2021

చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ జోష్ హెజిల్​వుడ్ ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. 10 నెలలుగా బయో బబుల్​లో ఉండటం వల్ల కుటుంబంతో గడపాలని నిశ్చయించుకున్నట్లు వెల్లడించాడు.

Josh Hazlewood
హెజిల్​వుడ్

By

Published : Apr 1, 2021, 9:31 AM IST

చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ జోష్ హెజిల్​వుడ్ ఐపీఎల్ 14వ సీజన్​ నుంచి తప్పుకొన్నాడు. లీగ్​లో పాల్గొనేందుకు ఇతడు ఈరోజు భారత్​కు బయల్దేరాల్సి ఉంది. కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఈ టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు హెజిల్​వుడ్.

"వివిధ టోర్నీల కారణంగా 10 నెలలుగా బయోబబుల్, క్వారంటైన్​లో గడిపా. అందుకే నాకు కొంత విశ్రాంతితో పాటు కుటుంబంతో సమయం గడపటం అవసరం అనిపించింది. అందుకోసం ఇంటివద్ద రెండు నెలలు ఉండాలనుకుంటున్నా. తర్వాత వెస్టిండీస్, బంగ్లాదేశ్ సిరీస్​ల్లో పాల్గొంటా. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్​తో పాటు యాషెస్ సిరీస్​ ఉంది. అందువల్ల వచ్చే 12 నెలలు చాలా కఠినంగా ఉండబోతుంది. అందుకోసం నేను మానసికంగా, శారీరకంగా దృడంగా ఉండాలనుకుంటున్నా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా."

-హెజిల్​వుడ్, ఆస్ట్రేలియా పేసర్

ఇప్పటివరకు టోర్నీ నుంచి వైదొలిగిన మూడో ఆస్ట్రేలియా ఆటగాడు హెజిల్​వుడ్. ఇప్పటికే జోష్ ఫిలిప్, మిచెల్ మార్ష్​ ఈ లీగ్​ నుంచి తప్పుకొన్నారు. సన్​రైజర్స్​ హైదరాబాద్​ ఆల్​రౌండర్ మిచెల్ మార్ష్ ఐపీఎల్​కు దూరమవగా ఇతడి స్థానంలో జాసన్ రాయ్​ను ఎంపిక చేసుకుంది ఫ్రాంచైజీ. అలాగే ఆర్సీబీ యువ బ్యాట్స్​మన్ జోష్ ఫిలిప్​ కూడా టోర్నీ నుంచి వైదొలిగాడు. వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకొంటున్నట్లు వెల్లడించాడు.

గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మూడు మ్యాచ్​లు ఆడాడు హెజిల్​వుడ్. అలాగే తుదిజట్టులో చోటు కోసం మొయిన్ అలీ, సామ్ కరన్, లుంగి ఎంగిడి, డ్వేన్ బ్రావోలతో పోటీపడుతున్నాడు.

ఇవీ చూడండి: సన్​రైజర్స్​ జట్టులోకి రాయ్​ ఎంట్రీ.. మార్ష్​ దూరం

ABOUT THE AUTHOR

...view details