తెలంగాణ

telangana

కరోనా బాధితుల కోసం ప్రపంచకప్ జెర్సీ వేలం

By

Published : Apr 1, 2020, 1:05 PM IST

కరోనా బాధితులకు సాయం చేసేందుకు ఇంగ్లాండ్ క్రికెటర్ జాస్ బట్లర్ ముందుకొచ్చాడు. ప్రపంచకప్ ఫైనల్లో ధరించిన టీషర్ట్​ను వేలం వేసి వచ్చిన డబ్బును బాధితుల చికిత్స కోసం ఉపయోగించనున్నట్లు తెలిపాడు.

బట్లర్
బట్లర్

కరోనా బాధితులకు సాయం చేయడానికి చాలా మంది ముందుకొస్తున్నారు. ఇంగ్లాండ్ బ్యాట్స్​మన్ జాస్ బట్లర్ కూడా తనవంతు సహాయం చేసేందుకు సిద్ధమయ్యాడు. 2019 ప్రపంచకప్​ ఫైనల్​ మ్యాచ్​లో తాను ధరించిన జెర్సీనీ వేలం వేస్తున్నట్లు ప్రకటించాడు. దీని ద్వారా వచ్చిన మొత్తాన్ని కరోనా బాధితుల చికిత్స కోసం అందిస్తానని చెప్పాడు.

"ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో నేను ధరించిన టీషర్ట్‌ను వేలం వేద్దామనుకుంటున్నా. వచ్చిన సొమ్మును లండన్‌లోని రాయల్‌ బ్రాంప్టన్‌, హార్​ఫీల్డ్ ఆస్పత్రులకు అందిస్తా. కరోనా బాధితులకు సేవలందిస్తున్న ఈ రెండు ఆస్పత్రులు తగినంత వైద్య పరికరాలు లేక ఇబ్బందులు పడుతున్నాయి. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. ఇంటి వద్దే ఉండండి. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయండి."

-బట్లర్, ఇంగ్లాండ్ క్రికెటర్

2019 జులై 14న లార్డ్స్‌ మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత ఇరుజట్ల స్కోర్లు సమం కాగా.. సూపర్‌ ఓవర్‌ నిర్వహించారు. ఈ ఓవర్​ కూడా టై కావడం వల్ల బౌండరీ కౌంట్ ద్వారా ఇంగ్లాండ్​ను విజేతగా ప్రకటించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details